బిగ్ బాస్ హౌస్ లో బోల్డ్ పాపగా అరియనా మంచి పేరు సాధించింది. ప్రస్తుతం జరుగుతున్న సీజన్ ఫోర్ చివరి దశకు చేరుకోవడంతో టాప్ ఫైట్ హౌస్ లో బీభత్సంగా ఉంది. ఈ వారం మినహా వచ్చేవారం ఫైనల్ వారం కావడం తో ఇంటిలో వాతావరణం నువ్వా నేనా అన్నట్టు ఇంటి సభ్యుల మధ్య నెలకొంది. భారి స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి.
కంటెస్టెంట్ ల ఫ్రస్టేషన్ ఓ రేంజ్ లో ఉంది, ఎవరికివారు టైటిల్ విన్నర్ కావాలని తెగ తాపత్రయ పడుతున్నారు. ఆల్రెడీ అఖిల్ వెళ్లిపోవడంతో మిగతా సభ్యుల మధ్య గొడవలు భారీగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా గత వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయిన జబర్దస్త్ అవినాష్ బయట తన ఫ్రెండ్ అరియనా కోసం బాగా కష్ట పడుతున్నారు.
ఖచ్చితంగా అరియనా కి సపోర్ట్ చేయాలని కోరుతున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాలో వీడియోలు చేసే ప్రతి ఒక్కరిని కలుస్తూ అరియనా ని గెలిపించాలని కోరడం జరిగింది. హౌస్ లో వీళ్ళిద్దరూ మొదటి నుండి చాలా క్లోజ్ అవటం తోపాటు ఒకానొక సందర్భంలో ఇద్దరూ ప్రేమలో పడినంత టైపులో హౌస్ లో వాతావరణం క్రియేట్ అవటం తో ఇద్దరి బాండింగ్ ఈ సీజన్ ఫోర్ లో చాలా హైలెట్ అయ్యింది. అయితే సరిగ్గా టాప్ ఫైవ్ లో కి వెళ్లక ముందు అవినాష్ ఎలిమినేట్ అవటంతో ఇంటిలో ఉన్న తన ఫ్రెండ్ అరియనా అయినా టాప్ ఫైవ్ లోకి వెళ్లాలని బయట భారీ స్థాయిలో క్యాంపెయిన్ చేస్తున్నారు.