బిగ్ బాస్ 4 : అందరూ మోనాల్ యే అంటున్నారు..!!

వీకెండ్ వస్తున్న నేపథ్యంలో ఈసారి ఇంటి సభ్యుల నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దాని విషయంలో బయట సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియ ఆడియన్స్ వోటింగ్ పరంగా కాకుండా.. స్క్రిప్టు పరంగా జరిగినట్లు బయట టాక్.

Bigg Boss Telugu 4: తొలి కంటెస్టెంట్‌గా మోనాల్ గుజ్జర్.. నాన్నను తలచుకొని కంటతడి | Bigg Boss Telugu 4: first Contestant Monal Gajjar life story.. - Telugu Filmibeatదేవి నాగవల్లి విషయంలో గాని కుమార్ సాయి ఎలిమినేషన్ విషయంలో గాని… బిగ్ బాస్ ఆడియన్స్ ఓట్లను పరిగణనలోకి తీసుకోకుండా షో నిర్వాహకులు తమ టిఆర్పి రేటింగ్ కోసం.. వాళ్ళ ఆలోచనా మేరకు ఇంటి సభ్యులను ఇంటి నుండి బయటకు పంపించినట్లు బయట చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈసారి మాత్రం ఎలిమినేషన్ లో మోనాల్ ఇంటి నుండి వెళ్ళిపోవటం గ్యారెంటీ అని బయట జనాలు తెగ చర్చించుకుంటున్నారు.

 

అసలు ఈ భామ గత వారంలోనే వెళ్లిపోవాల్సింది.. కావాలని షో నిర్వాహకులు ఆపరు అనే వార్తలు మొన్నటి వరకూ వైరల్ అయ్యాయి . దీంతో ప్రస్తుతం ఎలిమినేషన్ కి వెళ్లిన సభ్యులలో అతి వీక్ క్యాండెట్ మోనాల్ యే అని… కచ్చితంగా ఈ వారం ఆమె ఇంటి నుండి వెళ్ళి పోవడం తథ్యమని ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు కూడా ఈమె ఇంటి నుండి వెళ్లనివ్వకుండా, ఓటింగ్ పరంగా కాకుండా ఇష్టానుసారంగా షో నిర్వాహకులు వ్యవహరిస్తే…ఈ సీజన్ బిగ్ బాస్ కి ఓట్లు వేయటం వేస్ట్ అని బయట జనాల టాక్.