బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం అఖిల్ సీక్రెట్ రూమ్ లో ఉన్నాడు. ఇంటి సభ్యుల ఏకాభిప్రాయం మేరకు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన అఖిల్ సీక్రెట్ రూమ్ లో ఉంటూ… ఇంటి సభ్యులు తమ గురించి మాట్లాడుకుంటున్న మాటలను వింటున్నాడు. ఈ క్రమంలో అభిజిత్ మాట్లాడిన మాటలు బట్టి సీక్రెట్ రూమ్ లో అఖిల్ వున్నట్లు కనిపెట్టేసినట్లు భావిస్తున్నారు.
అఖిల్ ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యాక అభిజిత్ మాటలు ఇలా ఉన్నాయి. ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అంటూనే అఖిల్ ని ఇంటి నుండి బయటకు పంపేశారు. అదేవిధంగా కెప్టెన్సీ టాస్క్ లో కూడా సరైన గేమ్ ఆడలేదు అని అనవసంరగా పోగొట్టుకున్నారని అన్నాడు. అసలు అఖిల్ ఏం గేమ్ ఆడుతున్నావ్ అంటూ అడిగేస్తాను వస్తే మళ్లీ అన్నాడు అభిజిత్.
ఇవన్నీ అఖిల్ వింటున్నా సరే నో ప్రాబ్లమ్ అని కూడా అన్నాడు. దీన్ని బట్టి చూస్తే అభిజిత్ సీక్రెట్ రూమ్ లో అఖిల్ ఉన్నట్లు కరెక్ట్ గానే గెస్ చేసినట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు బయట జనాలు భావిస్తున్నారు. కాజా అభిజిత్ మాటలు వింటున్న అఖిల్ చాలా ఎటకారంగా స్పందించటం తో అసలు అఖిల్ అభిజిత్ గురించి ఏమనుకుంటున్నాడు అంటూ బయట తెగ డిస్కషన్ లు పెట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇంటిలో ఉన్న సభ్యులందరి వ్యవహారం చూసిన అఖిల్… బయటకు వచ్చాక ఏ విధంగా గేమ్ ఆడతాడు అన్నది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది.