బిగ్ బాస్ 4: సమంత అన్న మాటకు ఫీల్ అవుతున్న లాస్య ఫ్యాన్స్..!!

కింగ్ నాగార్జున కొత్త సినిమా షూటింగ్ కారణంగా హిమాలయాల ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో ఆయన ప్లేస్ లో సమంత రావడం తెలిసిందే. బిగ్ బాస్ దసరా పండుగ నాడు హోస్ట్ గా సమంత చూపించిన తన కొత్త టాలెంట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇంటిలో ఉన్న సభ్యులతో ప్రతి ఒక్కరితో కామెడీ జోనర్ తో మాట్లాడుతూనే… సైడ్ డైలాగ్ లు వేస్తూ ఎంతగానో నవ్వులు పూయించింది.

Bigg Boss 4 Contestant Anchor Lasya Latest Images - Telugu Actress Alluring  Amazing Pictures Georgeous Hot-TeluguStopయాంకరింగ్ గా సమంత చేసిన మొట్టమొదటి ప్రయోగం చాలా వరకు సక్సెస్ అయిందని బయట టాక్. ఇదిలా ఉండగా ఇంటి సభ్యులతో ప్రతి ఒక్కరి తో మాట్లాడిన సమంత యాంకర్ లాస్య పై వేసిన ఓ డైలాగ్ కి ఆమె అభిమానులు తెగ ఫీల్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. లాస్య గురించి సమంత మాట్లాడుతూ నవ్వుతూనే అందరిని బుట్టలో పడేస్తున్నారు, బయట మీది విన్నింగ్ స్మైల్ అని కొంతమంది అంటుంటే మరి కొంతమంది కన్నింగ్ స్మైల్ అని అనుకున్న వారు చాలా మంది ఎక్కువ ఉన్నారని… సమంత స్టేజిపై అనటంతో సోషల్ మీడియాలో లాస్య అభిమానులు తెగ ఫీల్ అవుతున్నట్లు టాక్.

 

అంతేకాకుండా సేఫ్ గేమ్ బాగా ఆడుతున్నావని లాస్య గురించి సమంత చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అవుతున్నాయి. లాస్య అసలు ఓపెన్ కావడం లేదని…మాస్క్ ధరించే ఇంకా గేమ్ ఆడుతోందని బయట జనాలు తెగ చర్చించుకుంటున్నారు. సరైన టాస్క్ సరైన కంటెస్టెంట్ లాస్య కి ఎదురైతే… ఎమోషనల్ అయ్యి వచ్చేయడం గ్యారెంటీ అని అంటున్నారు.