బిగ్ బాస్ 4: ఫినాలే డేట్ ఫిక్స్..??

బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. షో స్టార్ట్ అయిన సమయంలో ఇంటిలో ఎంటరైన సభ్యుల నీ చూసిన ఆడియన్స్… ఈసారి షో అట్టర్ ఫ్లాప్ అయిందని సోషల్ మీడియాలో తెగ చెప్పుకున్నారు. కానీ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారు కరోనా దెబ్బకు బయట సినిమా ధియేటర్ క్లోజ్ అవ్వటంతో…మెల్లమెల్లగా ఈ సీజన్ కి బాగా అలవాటుపడ్డారు.

Corona Impact? Bigg Boss Telugu Season 4 Gets Highest TRPsఒకపక్క ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నా గాని… షో కి మంచిగానే రెస్పాండ్ రావడం జరిగింది. భారీ స్థాయిలో టిఆర్పి రేటింగులు వచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. దాదాపు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లతోపాటు ఇంట్లో సభ్యులు 16 మంది మొత్తం 19 మంది హౌస్ లోకి ప్రవేశించగా… ప్రస్తుతం ఏడుగురు మాత్రమే మిగిలి ఉన్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఇంకా మూడు వారాల ఆట మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది.

 

అయితే ఈ వారంలో ఒక ఊహించని అతిధి సీక్రెట్ రూమ్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులను కలిసే ట్విస్ట్ ఉంటుందని అంటున్నారు. మరోపక్క కరోనా నేపథ్యంలో నేరుగా కాకుండా సీక్రెట్ రూమ్ లో… ఆ అతిధిని కూర్చోబెట్టి ఇంటి సభ్యుల చేత ఒక్కొక్కరితో ముచ్చటించే ఏర్పాట్లు… షో నిర్వాహకులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సీజన్ ఫినాలే ఎపిసోడ్ డిసెంబర్ 20వ తారీకు జరగబోతుందని లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. ఆరోజు ఊహించని గెస్ట్ తీసుకురావటానికి బిగ్ బాస్ షో నిర్వాహకులు ఇప్పటి నుండే ప్రయత్నాలు స్టార్ట్ చేసి నట్లు వార్తలు వస్తున్నాయి.