బిగ్ బాస్ హౌస్ లో యాంకర్ లాస్య, అభిజిత్, హారిక, నోయల్ ఉన్నంతకాలం చాలా క్లోజ్ గా రాణించడం జరిగింది. వీరిలో నోయల్ ఇంటి నుండి అనారోగ్యం కారణంగా వెళ్లిపోయిన సమయంలో లాస్య, అభిజిత్, హారిక బాగా బాధ పడ్డారు. ఆ తర్వాత లాస్య పోయిన వారం కాక అంతకు ముందు వారం ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వటం అందరికీ తెలిసిందే.
ఇంటి నుండి ఎలిమినేట్ అయిన నోయల్, లాస్య బయట ఉండి ఇంటిలో ఉన్న తన ఫ్రెండ్స్ కి సపోర్ట్ చేసే పనిలో ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లాస్య.. అభిజిత్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అభిజిత్ ఏ విషయం గురించి అయినా చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తాడు అని తెలిపింది.
అంతేకాకుండా హౌస్లో అభి గేమ్ స్ట్రాటజీ ఏంటి అని యాంకర్ ప్రశ్నించగా లాస్య మాట్లాడుతూ.. గేమ్ చాలా కూల్ గా వెళ్లాలి, కామ్ గా వెళ్లాలి, తన పాయింట్ స్ట్రైట్ గా ఉండాలి అనే స్ట్రాటజీ తో ఎప్పుడూ గేమ్ ఆడతాడు అని తెలిపింది. ఎప్పుడూ గొడవ పడాలి అనే ఉద్దేశంతో అభి ఆడాడు అని తెలిపింది. ఫిజికల్ టాస్క్ విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్ అని అభిజిత్ ని లాస్య ప్రశంసించింది. ఏది ఏమైనా ప్రస్తుతం జరుగుతున్న సీజన్ చివరి దశకు రావడంతో తన సపోర్ట్ అభిజిత్, హారికా కి ఉంటుందని లాస్య ఇంటర్వ్యూలో తెలిపింది.