బిగ్ బాస్ సీజన్ ఫోర్ దాదాపు సగం పూర్తి అయిపోయింది. ఇంటిలో ప్రస్తుతం 9 మంది సభ్యులు ఉన్నారు. అసలైన గేమ్ స్టార్ట్ కావటంతో ఎవరికివారు టాప్ ఫైవ్ లోకి వెళ్ళటానికి బాగా కష్ట పడుతున్నారు. హౌస్ లో ఫ్రెండ్ షిప్ లు రిలేషన్ లు కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎలిమినేషన్ విషయంలో గతంలో జరిగిన సీజన్ లో ఎన్నడు లేనివిధంగా ఈ సీజన్ ఎలిమినేషన్ సమయంలో అనేక విమర్శలు వచ్చాయి.
టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి, దివి, కుమార్ సాయి ఎలిమినేషన్ ఆడియన్స్ ఓటింగ్ పరంగా కాకుండా, పక్కా స్క్రిప్ట్ పరంగా బిగ్ బాస్ నిర్వాహకులు చేసినట్లు సోషల్ మీడియాలో భయంకరమైన విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇంటిలో చాలావరకు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండటం జరిగింది. ఇలాంటి తరుణంలో ఉన్న ఇంటి సభ్యులలో వీక్ కంటెస్టెంట్ ఎవరు అనే దాని విషయంలో ఎవరిని తీసి పారేయలేం.
ఎవరికివారు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా రాణిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఈసారి నామినేషన్ పరంగా చూసుకుంటే బిగ్ బాస్ హౌస్ నుండి ఈ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన ఇంటి సభ్యుల్లో అభిజీత్, అరియానా, హారికకు ఫుల్ సపోర్ట్ ఉంది బయట. వాళ్లకు ఓట్లు కూడా అలాగే పడుతున్నాయి. మిగిలిన ముగ్గురు మోనాల్, సోహైల్, మెహబూబ్. ఇందులో సోహైల్ కూడా కాస్త ఎడ్జిలో ఉన్నాడు. బయట కొద్దిగా సపోర్ట్ ఎక్కువగానే ఉంది. మరోవైపు మోనాల్ కూడా పర్లేదు. ఇక చివరి వ్యక్తి అయినా మెహబూబ్ విషయానికి వచ్చేసరికి ఈ సారి కచ్చితంగా ఎలిమినేట్ అవడం గ్యారెంటీ అని అందరూ అంటున్నారు. అతను దేవి నాగవల్లి ఎలిమినేషన్ సమయంలోనే వెళ్లి పోవలసిన వ్యక్తి మెహబూబ్ అని..కానీ ఆ సమయంలో మ్యాజిక్ ఏదో జరిగి బతికి పోయాడని కానీ ఈ సారి మాత్రం మెహబూబ్ ఇంటి నుండి ఎలిమినేట్ అవటం గ్యారెంటీ అని సోషల్ మీడియాలో నెటిజన్లు బయట జనాలు చెప్పుకొస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?