బిగ్ బాస్ హౌస్ లో టాప్ ఫైవ్ కోసం మంచి ఫైట్ ఐదుగురు మధ్య కొనసాగుతుంది. ఆల్ రెడీ అఖిల్ ఫైనల్ కి వెళ్లిపోవడంతో మిగిలి ఉన్న సోహెల్, అరియనా, అభి, హారిక, మోనాల్ మధ్య పోటీ నెలకొంది. ఇదిలా ఉండగా కొద్ది వారాల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల మద్దతుదారులు సోషల్ మీడియాలో బయట భారీ స్థాయిలో క్యాంపెయిన్ చేస్తున్నారు.
దేత్తడి హారిక వాళ్ళ అమ్మ మరియు అన్నయ్య సోషల్ మీడియాలో ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూ ఇస్తూ హారికా గురించి అనేక విషయాలు చెబుతూ ఆడియన్స్ని నెటిజన్లను సపోర్ట్ చేయాలని కోరుతున్నారు. దీనిలో భాగంగా హౌస్ లో తన బ్రేక్ అప్ లవ్ స్టోరీ గురించి హారిక చెప్పటంతో ఈ విషయంపై బయటికి వచ్చాక మీరు ఏమైనా అడుగుతారా..? హారిక లవ్ చేసింది ఎవరు అనే ఈ విషయం గురించి యాంకర్ హారిక తల్లి అని ప్రశ్నించగా ఆమె ఇచ్చిన సమాధానం ఆలోచనలో పడేసింది.
హారిక తల్లి జ్యోతి మాట్లాడుతూ.. భర్తను కోల్పోయి పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడి అనేక అవమానాలు పొందాను అని తెలిపింది. తన పిల్లలు తన కష్టాన్ని చూసి ఏనాడు కూడా అది కావాలి ఇది కావాలి అని మారం చేయలేదని అర్థం చేసుకున్నారని తెలిపింది. చాలా మెచ్యూర్ కలిగిన హారిక ప్రేమ గురించి ఆమె హౌస్ నుండి బయటకు వచ్చాక అడగాలి అని నేను అనుకోవడం లేదని తెలిపింది. కారణం బ్రేకప్ అయిపోయిందని తనే చెప్పింది. ఒకవేళ ఏదైనా ఉంటే అబ్బాయి ఎలాంటి వాడు ఏంటీ? అని అడిగేదాన్ని. ఇప్పుడు అయిపోయినదాని గురించి అడగాలని అనుకోవడం లేదు. జరిగిపోయిన దాన్ని మరిచిపోవాలని నా లైఫ్ని బట్టి నేర్చుకున్నా.. ఈ విషయంలో నా దగ్గర నా కూతురు ఏదో దాచిందని అనుకోవడం లేదు. అది వయసు ప్రభావం.. ఆ వయసులో అలా ఉంటుంది. దాన్ని పెద్ద తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకొని నా దగ్గర ఆ విషయం దాచి ఉంటుంది. అంతకు మించి వేరే ఏం లేదు” అంటూ వివరణ ఇచ్చింది హారిక తల్లి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?