బిగ్ బాస్ 4: ప్రస్తుతం ఇంటిలో ఉన్న కంటెస్టెంట్ లకు అందరికీ వార్నింగ్ ఇచ్చిన హరితేజ..!!

బిగ్ బాస్ సీజన్ వన్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన హరితేజ అప్పట్లో అందరినీ ఆకట్టుకునే విధంగా హౌస్ లో రాణించడం జరిగింది. టాస్క్ ఆడే విషయంలో గాని ఇతరులతో వాగ్వాదం చేసే విషయంలో గానీ ఎంటర్టైన్ చేయడంలో గాని హరితేజ అప్పట్లో హౌస్ లో బాగా అలరించింది. టాప్ ఫైవ్ లో కి కూడా వెళ్లడం జరిగింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం రన్ అవుతున్న సీజన్ ఫోర్ లో ఇంట్లో దెయ్యం అనే టాస్క్ బిగ్ బాస్ పెట్టి ఇంటి సభ్యులను వణికిస్తున్న సంగతి తెలిసిందే.

Hari Teja about actual age: I am just 28 - tollywoodఅయితే హౌస్ లో దెయ్యం గా అవినాష్ అదేవిధంగా అరియనా ఎవరికి వారు తమ పెర్ఫార్మెన్స్ లతో రెచ్చిపోతున్నారు. మరోపక్క హౌస్ లో రకరకాల టాస్క్ లు పెడుతూ కన్ఫెషన్‌ రూమ్ కి ఇంటి సభ్యులను పిలిచి హర్రర్ ఎఫెక్ట్ లైటింగ్ సౌండ్ లతో బిగ్ బాస్ వణికించారు. ఇదిలా ఉండగా దెయ్యంగా మాట్లాడుతున్నది హరితేజ అంటూ హౌస్ లో ఉన్న సభ్యులంతా ఇటీవల కామెంట్ చేయడంతో ఆమె సోషల్ మీడియాలో బిగ్ బాస్ హౌస్ ఇంటి సభ్యుల పై సీరియస్ కామెంట్ చేసింది.

 

ఆ దెయ్యం టాస్క్ లో గొంతు మీరే,ఆ గొంతు మీదే అంటూ నా పైన ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తున్నారు, నాకు ఆ దెయ్యానికి అస్సలు సంబంధం లేదు అంటూ ఇంస్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేశారు హరితేజ. పోనీలే పిల్లలు అనుకుంటే మరీ రెచ్చిపోతున్నారు అంటూ చురకలు అంటించారు.