హీరోయిన్ దీక్షా పంత్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కొద్దోగొప్పో సినిమాలు చేయడం జరిగింది. కాని పెద్దగా పాపులారిటీ సంపాదించ లేదు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ ఓన్ లో వైల్డ్ కార్డు రూపంలో ఎంట్రీ ఇవ్వడం జరిగిందో ఆమె దశ దిశ మారి పోయింది. మంచి పాపులారిటీ సంపాదించింది. సీజన్ వన్ కి హౌస్ లో గ్లామర్ పరంగా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం సీజన్ ఫోర్ చివరి దశకు చేరుకున్న తరుణంలో దీక్ష పంత్ … కంటెస్టెంట్ సోహెల్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవటానికి అన్ని విధాలా అర్హుడు అని తెలిపింది. అంతమాత్రమే కాకుండా అతని మనసు చాలా మంచిది అని లోపల బయట ఎటువంటి మాస్క్ గేమ్ ఆడకుండా, జెన్యూన్ గా ఫస్ట్ నుండి ఆడుతుంది సోహెల్ ఏ అని తెలిపింది.
ఖచ్చితంగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కి అన్ని విధాలా అర్హుడు సోహైల్ అని అతని గెలిపించాలి అంటూ సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తూ వీడియో పోస్ట్ చేసింది. సోహెల్ కోసం హీరో హీరోయిన్లు మాత్రమే కాక తాజాగా కరీంనగర్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే కూడా సపోర్ట్ చేస్తూ సోహెల్ ని గెలిపించాలని కోరారు. మొత్తం మీద చూస్తే చివరిలో సోహెల్ హవా భారీ స్థాయిలో కొనసాగుతోంది.