బిగ్ బాస్ 4: ఈసారి ఆ కంటెస్టెంట్ తప్పించుకోవడం కష్టమే…??

బిగ్ బాస్ సీజన్ ఫోర్ చివరికి వచ్చేసరికి రసవత్తరంగా సాగుతుంది. ఇంటిలో రకరకాల టాస్క్ లు ఇస్తున్న బిగ్ బాస్ వేస్తున్న స్ట్రాటజీ లు తలకిందులు అయ్యేలా… ఇంటిలో వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. 13వ వారం స్టార్ట్ కావటంతో ఇంటిలో సోమవారం జరగబోయే ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ ఇంటి సభ్యుల మధ్య భారీ స్థాయిలోనే మంటను రగిల్చి నట్లు తాజా ప్రోమో బట్టి తెలుస్తుంది.

Bigg Boss 4 Telugu: Harika Will Be The Last Captain - Sakshiప్రోమోలో చూసుకుంటే అవినాష్ అదేవిధంగా మోనాల్ మధ్య గట్టిగానే గొడవ జరిగినట్లు తెలుస్తోంది. కారణం ఆరియనా. అదేవిధంగా అఖిల్ కి మళ్లీ అభిజిత్ తో మోనాల్ తో భారీగానే గొడవ జరిగినట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ సారి మాత్రం నామినేషన్ ప్రక్రియ లో అందరి కంటే హైలెట్ అయ్యేది మోనాల్ అనే టాక్ సోషల్ మీడియా లో వినపడుతోంది.

 

పరిస్థితి ఇలా ఉండగా లీక్ వార్తల ప్రకారం ఈ సారి అభిజిత్, అఖిల్, అవినాష్, మోనాల్, హారిక ఎలిమినేషన్ లిస్టు లో ఉన్నట్లు సమాచారం. అయితే ఈసారి మాత్రం హౌస్ నుండి కంటెస్టెంట్ అవినాష్ గ్యారెంటీగా ఎలిమినేట్ అవటం పక్కా అని తాజా వార్త పై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. మొన్న ఏదో సేవ్ అయిపోయిన అవినాష్ ఈసారి మాత్రం… ఓటింగ్ పరంగా చూసుకుంటే మిగతా వారితో పెద్దగా రాణించలేక పోతున్నాడని బిగ్ బాస్ ఆడియన్స్ చెప్పుకొస్తున్నారు.