బిగ్ బాస్ షో ఈవారం ఎలిమినేషన్ రౌండ్ పూర్తయిన తర్వాత టాప్ ఫైవ్ లో ఎవరుంటారు అన్నది ఒక స్పష్టత వస్తది. అయితే ఇంటి లో ప్రస్తుతం ఐదుగురు టాప్ ఫైవ్ లో ఉండటం కోసం ఈ వారం అంతా బాగా కష్టపడ్డారు. ఈ నేపథ్యంలో ఎలిమినేషన్ కి నామినేట్ అయిన ఇంటి సభ్యులలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది చాలా సస్పెన్స్ గా ఉంది.
మరోపక్క ఓటింగ్ పరంగా చూసుకుంటే హారిక కి మోనాల్ కి మధ్య పోటాపోటీ నువ్వానేనా అన్నట్టుగా ఉండటం తో…హారిక నీ టాప్ ఫైవ్ లో చేర్చడం కోసం సీజన్ ఫోర్ లో ఎలిమినేట్ అయిన లాస్య, నోయెల్ బాగా కష్ట పడుతున్నారు అట. అంతేకాకుండా గంగవ్వ సుజాత కూడా హారికా కి సపోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం హౌస్ లో ఉన్న వారిలో హారికా కి బయట మంచి సపోర్ట్ ఉన్నట్లు తెలుస్తోంది.
మరి ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అవుతుందో సేఫ్ అవుతుందో చూడాలి. మరోపక్క మోనాల్ కి కూడా సపోర్ట్ నార్మల్ నెటిజన్ల నుండి వస్తూ ఉంది. చివరి రెండు వారాలు మోనాల్ ఓటింగ్ గ్రాఫ్ ఎవరూ ఊహించని విధంగా ఉండటంతో… ఆమె ఆటతీరు చాలా మెచ్యూర్ గా ఉండటంతో..మోనాల్ గ్యారెంటీ టాప్ ఫైవ్ లోకి వెళ్ళే అవకాశం ఉందని… ఇద్దరిలో ఎవరో ఒక్కరు ఎలిమినేట్ అవుతారని.. బిగ్గ్ బాస్ ఆడియన్స్ అంచనా వేస్తున్నారు.