దాదాపు వంద రోజులకు పైగా తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను అలరించింది బిగ్ బాస్ రియాల్టీ షో. వైల్డ్ కార్డు తో కలిపి మొత్తం 19 మంది హౌస్ లో ఎంటర్ అవ్వగా ప్రస్తుతం ఐదుగురు మాత్రమే మిగిలి ఉన్నారు. అయితే ఈ రోజు గ్రాండ్ ఫినాలే అయిన నేపథ్యంలో టైటిల్ ఎవరు గెలుస్తారు అన్న దాని విషయంలో ఆడియన్స్ కి నరాలు తెగిపోయే టెన్షన్, సస్పెన్స్ నెలకొన్న క్రమంలో బయట మాత్రం చాలా విచిత్రమైన వాతావరణం కనిపిస్తుంది.
ఈ షో కి సంబంధించి ఎపిసోడ్ ప్రసారం కాకముందే చాలా విషయాలు ముందే లీక్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే చివరి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం అన్నపూర్ణ స్టూడియో ఏరియా లో బిగ్ బాస్ షో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి వార్త లీక్ అవ్వకుండా స్టాఫ్ అందరికి చాలా పరిమితులు పెట్టారట. దీంతో కేవలం షూటింగ్ కి టెలికాస్ట్ అయ్యే సమయానికి రెండు గంటలు మాత్రమే తేడా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందట.
ఇటువంటి తరుణంలో సోషల్ మీడియాలో ఆల్రెడీ షూటింగ్ అయిపోయిందని, టైటిల్ విన్నర్ అబి గెలిచినట్లు వస్తున్న ఈ వార్తలలో వాస్తవం లేదని చెప్పుకొస్తున్నారు. టైటిల్ విన్నర్ ఎవరు అన్న దాని విషయంలో సస్పెన్స్ కొనసాగించేలా షో నిర్వాహకులు పగడ్బందీగా వ్యవహరిస్తున్నట్లు ఈసారి లేడీ కంటెస్టెంట్ కి టైటిల్ దొరికే అవకాశం ఉన్నట్లు తాజాగా సోషల్ మీడియాలో వినపడుతున్న టాక్.