బిగ్ బాస్ రియాల్టీ షో 12వ వారం ఎపిసోడ్ మరికొద్ది గంటల్లో స్టార్ట్ కానుంది. ఇంటి నుండి యాంకర్ లాస్య ఎలిమినేట్ అవటంతో హౌస్ లో వాతావరణం సరికొత్త గా మారింది. లాస్య ఇంటిలో ఉన్నంతకాలం కిచెన్ లో ఉంటూ ప్రతి ఒక్కరికి వంట చేయడం జరిగింది. అయితే ఇంటి నుండి ఆమె ఎలిమినేట్ అవటంతో చాలామంది ఇంటి సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.
ముఖ్యంగా సోహైల్ అయితే చాలా బాధపడ్డాడు. ఇదిలా ఉండగా హౌస్ నుండి ఎలిమినేట్ అయిన లాస్య బిగ్ బాస్ వేదికపై వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెబుతూ వచ్చింది. ఇక అరియనా ఈ విషయంలో కాస్త డోస్ గట్టిగానే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫస్ట్ నుండి వీరిద్దరి మధ్య హౌస్ లో కోల్డ్ వార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హిట్ మాన్ టాస్కులో పరిగెత్తుకుంటూ వెళ్లాలి.
ఆ డెన్లోకి ఎవరు ముందు వెళ్తే వాళ్లకే నామినేట్ చేసే అవకాశం వచ్చిన సమయంలో నాకోసం దెబ్బలు తిని మరి నన్ను నామినేట్ చేయడం చాలా బాగా నచ్చింది అంటూ వెళ్లిపోయే టైం లో అరియానాకు లాస్య గట్టి కౌంటర్ వేసింది. ఈ క్రమంలో అరియానా స్పందిస్తూ అప్పటి పరిస్థితులు అలా ఉన్నాయి అంటూ సమాధానమిచ్చింది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ లో అమ్మాయి గెలిస్తే చూడాలని ఉంది అంటూ లాస్య తన మనసులో మాట బయట పెట్టింది. మరోపక్క తన దృష్టిలో టాప్ 2 మాత్రం అభిజిత్, సోహెల్ అని పేర్కొంది.