బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన అమ్మ రాజశేఖర్ బయట వెబ్ మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ మీద ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో హౌస్ లో ఉన్న రోజులు గుర్తు చేసుకుని కంటెస్టెంట్ లపై తన అభిప్రాయాలను తాజాగా వెల్లడించారు. ఈ క్రమంలో ఇంటిలో సభ్యురాలైన యాంకర్ లాస్య గురించి అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మొహం లో ఉన్న క్లారిటీ మనసులో ఉండదని, చాలా కన్నింగ్ క్యాండిడేట్ అన్నట్టు వ్యాఖ్యానించారు. లాస్య నవ్వుకు పది అర్ధాలు ఉంటాయని తెలిపారు. గేమ్ లో సానుభూతి సంపాదించుకోవడానికి కుటుంబ కథలు చెబుతుందని తన భర్త గురించి తన వివాహం గురించి మాట్లాడుతుంది… అది అనిసార్లు వర్కవుట్ కాదు కదా అంటూ మాస్టర్ లాస్య గురించి చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా హౌస్ లో ఆమె వల్లనే గ్రూపులు ఏర్పడుతున్నాయని.., ఎమోషన్స్ ని బాగా కంట్రోల్ చేసుకుంటుంది అంటూ లాస్య గురించి అమ్మ రాజశేఖర్ తన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక హౌస్ లో హిట్లర్ మాదిరిగా అరీయనా కెప్టెన్సీ ఉందని అన్నారు. కాగా హౌస్లో మళ్లీ బిగ్ బాస్ ఎవరైనా ఎలిమినేట్ చేసి మిమ్మల్ని లోనికి వెళ్ళమని చెబితే ఎవరిని ఎలిమినేట్ చేస్తారని మాస్టర్ని ప్రశ్నించగా, ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే అభిజిత్ ని ఎలిమినేట్ చేసి తాను హౌస్ లోకి ఎంటర్ అవుతానని… తనవల్ల టిఆర్పి రేటింగులు పెరుగుతాయని, అభిజిత్ కెవలం కూర్చోవడం తప్ప ఏమీ ఉండదని పేర్కొన్నారు.