బిగ్ బాస్ ఇంటిలో కంటెస్టెంట్ ల కుటుంబ సభ్యులు వస్తున్న నేపథ్యంలో షో చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే అభిజిత్, అఖిల్, హారిక వాళ్ల పేరెంట్స్ రావటం జరిగింది. ఈ క్రమంలో అఖిల్ వాళ్ళ తల్లి ని చూసి బాగా ఎమోషనల్ అయిపోయాడు. అదే సమయంలో అఖిల్ వాళ్ళ మదర్ మోనాల్ ని ఫ్రెండ్ అంటూ సంబోధిస్తూ, మీ ఫ్రెండ్ ని బాగా చూసుకోవాలని తెలిపింది.
ఇదే తరుణంలో అభిజిత్ వాళ్ళ మదర్ అందరూ బాగా ఆడాలని, ఇదంతా జస్ట్ గేమ్ అంటూ ఇంటి సభ్యులలో జోష్ నింపారు. ఇదిలా ఉండగా ఇంటిలో ఉన్న సభ్యులంతా చాలావరకు తెలుగు వాళ్ళు కావడంతో కంటెస్టెంట్ మోనాల్ దీ గుజరాత్ కావటంతో.. ఆమె ఇంటి సభ్యులు ఎవరు రానట్టు తాజా ప్రోమో బట్టి తెలుస్తోంది. దీంతో మోనాల్ వాళ్ళ అమ్మ ఆడియో ని బిగ్ బాస్ వినిపించడంతో చాలా ఎమోషనల్ అయిపోయింది.
ఎవరికీ చెప్పకుండా డైరెక్ట్ గా బాత్రూం లోకి వెళ్ళిపోయి గతంలో మాదిరిగా గట్టి గట్టిగా ఏడ్చేసింది. వాస్తవానికి ముందుండి ఫ్యామిలీతో తన అటాచ్మెంట్ చాలా బాగా ఉండటంతో మోనాల్ ఏడుపుకి ఇంటిలో ఉన్న సభ్యులంతా బాధపడ్డారు. అందరి కంటెస్టెంట్ ల ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా గానీ మోనాల్ కి రాకపోవటం దారుణమని సోషల్ మీడియాలో ప్రోమోలు చూసి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదే తరుణంలో ఈరోజు సోహెల్ వాళ్ళ నాన్నగారు, అదేవిధంగా అరియనా వాళ్ల బెస్ట్ ఫ్రెండ్, యాంకర్ లాస్య కొడుకు జున్ను అదేవిధంగా భర్త వచ్చినట్లు తెలుస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?