బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. దాదాపు గేమ్ చివరి దశకు చేరుకోవడంతో చూస్తున్న ఆడియన్స్ కి కూడా ఇంట్రెస్ట్ కలిగించే రీతిలో బిగ్ బాస్ షో నిర్వాహకులు సరికొత్తగా షో ఆవిష్కరిస్తున్నారు. కాగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల ఇంటి సభ్యులు వచ్చిన ఎపిసొడ్ ఇంటిలో సరికొత్త వాతావరణాన్ని క్రియేట్ చేసింది.
అందరూ కలిసి పోయారు. ఇదిలా ఉండగా శనివారం జరిగిన ఎపిసోడ్ లో మరొకసారి నాగార్జున ఇంటి సభ్యుల కుటుంబ సభ్యులను వేదిక పైకి తీసుకొచ్చే రీతిలో ప్లాన్ చేయటంతో.. చూస్తున్న ఇంటి సభ్యులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. దీనిలో భాగంగా మోనాల్ తల్లి గీతా కూడా రావటం జరిగింది. ఈ సందర్భంగా ఆమె తో మోనాల్ తరువాత మీకు ఇష్టమైన ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అని నాగార్జున ప్రశ్నించిన సమయంలో అందరూ అఖిల్ పేరు గ్యారెంటీగా చెబుతారని భావించారు.
కానీ ఎవరూ ఊహించని విధంగా అభిజీత్ పేరు చెప్పింది మోనాల్ తల్లి గీత. దాంతో అక్కడున్న మోనాల్, అఖిల్ షాక్ అయ్యారు. అభిజీత్ అయితే పండగ చేసుకున్నాడు. పైగా పక్కనే ఉన్న మోనాల్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అభిజీత్ వెళ్తుంటే.. ఛల్ అంటూ తప్పుకుంది. ఈ దెబ్బతో అఖిల్ మొహం మాడిపోయింది. దీంతో సోషల్ మీడియాలో అభిజిత్ అభిమానులు అందరి ముందు మోనాల్ తల్లి అఖిల్ పరువు తీసేసింది అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. మొత్తంమీద చూసుకుంటే చాలా మంది ఇంటి సభ్యుల కుటుంబ సభ్యులు ఎక్కువగా అభిజిత్ పేరు చెప్పటంతో బాగా ఆయనకి పాపులారిటీ పెరిగిందని ఇంటి సభ్యులు కూడా గట్టిగా అర్థం చేసుకున్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?