బిగ్ బాస్ 4: ఈ దెబ్బతో వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ చెడిపోయినట్లే నా..??

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో చివరి దశకు చేరుకోవడంతో ఇంటిలో ఫేవరెట్ కంటెస్టెంట్ లకు బయట చాలా మంది ప్రముఖులు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తున్నారు. ఓటింగ్ పరంగా చూసుకుంటే ఈ సీజన్లో మొదటి నుండి అభిజిత్ భారీ స్థాయిలో ఓట్లు కొల్లగొడుతున్నాడు.

Bigg Boss 4 Telugu: Abhijeet Fires On Harika Over BB Daycare Task - Sakshiఆ తరువాత అఖిల్, హారిక ఉండగా గేమ్ చివరి దశకు వచ్చేసరికి మోనాల్ ఓటింగ్ గ్రాఫ్ తారాస్థాయిలో ఉంది. చాలా మెచ్యూర్ గేమ్ ఆడుతున్న మోనాల్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదిలా ఉండగా సోమవారం ప్రసారం కాబోయే ఎలిమినేషన్ నామినేషన్ ప్రోమో లో ఇంటిలో ఫస్ట్ నుండి మంచి స్నేహితులుగా ఉన్న అభిజిత్, హారిక మధ్య మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది.

 

కారణం చూస్తే వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున.. కెప్టెన్ గా ఉన్న హారిక…అభి పట్ల ఫేవరేటజం చూపించినట్లు, కెప్టెన్గా విఫలమైనట్లు ఇచ్చిన క్లాస్ ఎఫెక్ట్… నామినేషన్ ప్రక్రియ లో ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి నట్లు తాజా ప్రోమో బట్టి తెలుస్తోంది. మొత్తంమీద చూసుకుంటే మొదటినుండి అభిజిత్ అదేవిధంగా హారిక ఎక్కడా కూడా గొడవలు పడ్డ సందర్భాలు లేవు. కానీ హారిక కెప్టెన్ టైంలో అభి పట్ల వ్యవహరించిన తీరుకు నాగార్జున పీకిన క్లాస్ కి… 13వ వారం నామినేషన్ లో ఇద్దరి మధ్య బాగానే గొడవలు అయినట్లు రిలీజ్ అయిన ప్రోమో బట్టి అర్థం అవుతుంది.