సీక్రెట్ ఎలిమినేషన్ లో భాగంగా హౌస్ లోనే గృహనిర్బంధం లోనే కంటెస్టెంట్ అఖిల్ ని బిగ్ బాస్ పంపించడం జరిగింది. సీక్రెట్ రూమ్ లో ఉన్న అఖిల్ ఇంటిలో జరుగుతున్న ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటూ ఇంటి సభ్యులు తనపై చేస్తున్న కామెంట్లకు సీక్రెట్ రూమ్ లోనే ఉంటూ కౌంటర్లు వేస్తున్నాడు. ముఖ్యంగా అభిజిత్ ఆడుతున్న గేమ్ కి అఖిల్ చేస్తున్న కామెంట్లు.. ఈ వారంలోనే బిగ్ బాస్ షో కి హైలెట్ గా నిలిచాయి.
ఇదిలాఉంటే లెటర్లు ఇంటి సభ్యులకు ఇచ్చే టాస్క్ విషయంలో అఖిల్ చాలా చక్కగా వ్యవహరించారని బిగ్ బాస్ పొగుడుతూ అఖిల్ కి ఇంటి నుండి వచ్చిన లెటర్ ని పోస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో తన తల్లి తనకు రాసిన లెటర్ ని చూసి చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఈ క్రమంలో మీకు ఎలా థాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు నా బర్త్ డే కి విషెస్ తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్ అంటూ అఖిల్ కంటతడి పెట్టుకున్నాడు.
ఇదిలా ఉంటే తన సీక్రెట్ రూమ్ లో ఉండలేక పోతున్నట్లు, ఒంటరిగా ఇలా రూమ్ లో ఉండటం చాలా కష్టంగా ఉందని, గుండె బరువెక్కి పోతున్నది, మనసంతా ఎలానో ఉంది అంటూ అఖిల్ చెప్పాడు. ఇదిలా ఉంటే ఈ వీకెండ్ లో హోస్ట్ నాగార్జున.. అఖిల్ ని సీక్రెట్ రూమ్ నుండి విడిపించే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఇంటిలో ఉన్న అందరి గేమ్ చూసిన అఖిల్ బయటకు వచ్చాక.. ఎటువంటి గేమ్ ప్లానింగ్ తో ఆడతాడు అన్నది సస్పెన్స్ గా ఉంది.