బిగ్ బాస్ 4: అవినాష్ లో ఉన్న మైనస్ అదే అంటున్న నాగబాబు..!!

ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో రెండో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్ అవినాష్ ఎంటర్టైన్ బాగా చేస్తున్నాడు. హౌస్ లో అడుగు పెట్టిన నాటి నుండి ఇంటి సభ్యులపై జోకులేస్తూ ఆడియన్స్ ని ఎంతగానో నవ్వులు పూయించాడు. అయితే ఎలిమినేషన్ సమయానికి వచ్చేసరికి నిరుద్యోగ కథలు ఆత్మహత్య ఈఎంఐ లు కట్టుకోలేక అప్పు తీర్చలేక లాక్ డౌన్ సమయంలో సూసైడ్ కి కూడా పాల్పడినట్లు సింపతీ ప్రదర్శిస్తూ చాలా వరకు గేమ్ ఆడటం జరిగింది.

Bigg Boss తర్వాత అదిరింది బొమ్మ షోలోకి అవినాష్ - Telugu Oneindiaఎలిమినేషన్ సమయంలో మరీ అతిగా ప్రవర్తించే వారు. ఇప్పుడు ఇదే విషయాన్ని నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ లో అవినాష్ గురించి చెప్పుకొచ్చారు. వానికి అవినాష్ ఏడిచే రకం కాదని కానీ హౌస్ లోకి వెళ్లిన తర్వాత అవినాష్ ప్రవర్తిస్తున్న తీరు చాలా తేడా కనిపిస్తుంది అటు పేర్కొన్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఏడిస్తే పనికాదు ఆ విషయం వాడికి అర్థం కావడం లేదు అంటూ చెప్పుకొచ్చారు.

 

బిగ్ బాస్ హౌస్ లో అవినాష్ సింపతీ ప్రదర్శించడం అతి పెద్ద మిస్టేక్ అంటూ నాగబాబు తన అభిప్రాయాన్ని తెలిపారు. ఇదిలా ఉండగా ఈ వారం ఎలిమినేషన్ విషయంలో అవినాష్ ఇంటి నుండి బయటకు వెళ్లే అవకాశం లేదని ఎవిక్షన్ పాస్ రావడంతో ఈ వారం సేవ్ అవ్వడం గ్యారెంటీ అని బయట జనాలు చెప్పుకుంటున్నారు.