తెలుగు ..హిందీ ..తమిళంలో బిగ్ రియాలిటి షో గా బిగ్ బాస్ షో కి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొన్న సంగతి తెలిసిందే. హిందీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. తమిళంలో లోకనాయకుడు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తుండగా తెలుగులో మొదటి సీజన్ కి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, సీజన్ 2 కి నేచురల్ స్టార్ నాని, సీజన్ 3 కి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు.
ఇక బాలీవుడ్ లో ఇప్పటికే 13 సీజన్లు కంప్లీట్ చేసుకుంది. త్వరలో అక్కడ సీజన్ 14 మొదలవబోతుండగా ఈ సీజన్ కి కూడా సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. అలాగే మన తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 త్వరలో ప్రారంభం కాబోతుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన సీజన్ 4 ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. నాగార్జున త్రిపాత్రాభినయం.. కొత్త ఐడియాతో నిర్వాహకులు తయారు చేసిన బిగ్ బాస్ 4 ప్రోమో టెలికాస్ట్ అవుతోంది.
సీజన్ 4 కోసం ఇప్పటికే 16 మంది కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసి స్వీయనిర్భంధంలో ఉంచారు నిర్వాహకులు. ఈ 16మందికి కోవిడ్ 19 టెస్టులు చేసిన తర్వాతే ఎంపిక చేసుకున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 4 షో ప్రారంభానికి మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉండటంతో నిర్వాహకులు కంటెస్టెంట్స్ పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇక ఆగస్టు 30 నుంచి షో మొదలవుతోందని సమాచారం. సీజన్ 3 కి హస్ట్ గా వ్యవహరించిన నాగార్జున అక్కినేని సీజన్ 4 కి హోస్ట్ గా వ్యవహరించబోతుండటంతో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం నాగార్జున 3 గెటప్పులతో విడుదలయిన సీజన్ 4 ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాదు ఈ 3 గెటప్పులలో నాగార్జున ఏ గెటప్ లో కనిపిస్తాడన్నది కూడా క్యూరియాసిటీని పెంచుతుంది.
ఇదంతా బాగానే ఉంది. అయితే కరోనా కారణంగా, నాగార్జున తన ఏజ్ మూలంగా బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వ్యవహరించడానికి చాలా జాగ్రత్తలు చెబుతున్నాడట. కరోనా 60 ప్లస్ వాళ్ళ మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఇప్పుడు నాగార్జున వయసు కూడా 60 కి దగ్గర్లో ఉంది. అందుకే ఈ ఒక్క విషయంలో కాస్త భయపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అందుకే గత సీజన్ లో మాదిరిగా కంటెస్ట్స్ ని చేయి పట్టుకొని మాట్లాడకుండా ఫిజికల్ డిస్టెన్స్ మేయింటైన్ చేస్తున్నారట. తన చుట్టు ఎక్కువ మంది ఉండకుండా చూసుకుంటున్నాడని సమాచారం.