బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో 8వ వారం ఎలిమినేషన్ ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగింది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లందరితో రికార్డింగ్ డాన్స్ లాంటి కార్యక్రమాన్ని ఆడించి మ్యూజిక్ వినిపించి దానికి తగ్గ కనిపెట్టి డాన్స్ చేయాలి అనే టాస్క్ లతో ఇంటి సభ్యుల చేత స్టెప్పులు వేయించారు నాగార్జున. ఈ తరుణంలో ఆ పాటకి సంబంధించి సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ అప్పటి రోజుల్లో కి వెళ్ళిపోయారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున కెరీర్లోనే ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా…. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చినా “హలో బ్రదర్” సినిమా పాట “ప్రియా రాగలే” సాంగ్ బిగ్ బాస్ షోలో రావడంతో ఆ సాంగ్ లో సౌందర్య తో వేసిన స్టెప్పులను ఆదివారం నాడు జరిగిన ఎపిసోడ్ లో గుర్తు చేసుకున్నారు. అప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన సౌందర్య ని మొట్టమొదటి సారి నాగార్జున ఆ సినిమా సెట్ లో చూసినట్లు బిగ్ బాస్ హౌస్ లో తెలిపారు.
రాజ్ కోటి మ్యూజిక్ అందించిన ఈ సినిమా 1994లో వచ్చింది. మెలోడీ, మాస్, క్లాస్ కలబోసి వచ్చిన పాటలు ఇప్పటికీ కూడా సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తుంటాయి. ఈ నేపథ్యంలో హౌస్లో ఈ సాంగ్ కి అమ్మ రాజశేఖర్ హారిక ఇద్దరు కలిసి స్టెప్పులు వేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ… హలో బ్రదర్ సినిమా షూటింగ్ స్టార్ట్ ఈ సాంగ్ తోనే జరిగినట్లు క్లారిటీ ఇచ్చారు. అప్పుడే సౌందర్యాన్ని కలిసినట్లు… అదే ఫస్ట్ టైం అనట్లు క్లారిటీ ఇచ్చారు. ఈ పాట ఎప్పుడు విన్నా సౌందర్య గుర్తొస్తారు అని నాగార్జున తెలిపారు. ఇదిలావుండగా అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ… ఈ సినిమాకి సంబంధించి వచ్చిన పాట గ్రూప్ లో తానొక డ్యాన్స్ మెంబర్ అన్నట్టు తెలిపారు. ఈ క్రమంలో మీకు అప్పుడు వేసిన స్టెప్పులు ఇంకా గుర్తున్నాయా మాస్టర్ అంటూ నాగార్జున ప్రశంసించారు.