బిగ్ బాస్ హౌస్ లో బలమైన కంటెస్టెంట్ గా పేరొందిన నోయల్ ఇంటి నుండి వెళ్లిపోయాడు. హౌస్ లో స్టార్టింగ్ నుండి కొన్ని కష్టతరమైన టాస్క్ లో తన వల్ల కాదంటూ తన ఆరోగ్యం సహకరించడం లేదని మొదటి నుండి మొత్తుకుంటూనే ఉన్నాడు. అయితే ఈ విషయంలో ఇంటి సభ్యులు నోయల్ డ్రామాలాడుతున్నారని, తప్పించుకున్నాడని తప్పుపట్టడం జరిగింది.
అయితే ఇటీవల మరి సీరియస్ కండిషన్ అన్న తరహాలో నోయల్ పరిస్థితి మారటంతో అనారోగ్యంతో బాధపడుతున్న నోయల్ ని వైద్యులు పరీక్షించారు. అతడు మెడికల్ రూమ్ కి వెళ్లడం అక్కడ వైద్యులు చెక్ చేయడం తో పరిస్థితి సీరియస్ గా ఉందని స్పెషలిస్టులు మెరుగైన వైద్యం కోసం ఇంటికి వెళ్లాలని తేల్చడంతో బిగ్ బాస్ నోయల్ ని కన్ఫా క్షన్ రూమ్ లోకి పిలిచి … పర్మిషన్ ఇవ్వడం తో నోయల్ మెరుగైన వైద్యం కోసం హౌస్ నుండి బయటకు వచ్చేశాడు.
ఈ క్రమంలో నోయల్ అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికి వెళ్లే సందర్భంలో ఇంటి సభ్యురాలు హారిక గుక్క పెట్టి మరి ఏడిచింది. ఈ క్రమంలో ఆమెను అభిజిత్ హత్తుకొని ఓదార్చాడు. మరో పక్క ఇంటి సభ్యులు అంతా త్వరలో అనే ఆరోగ్యవంతులై తిరిగి రావాలని మీ కోసం ఎదురు చూస్తాను అంటూ నోయల్ కి ధైర్యం చెప్పి సాగనంపారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?