తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆదరిస్తున్న బిగ్ బాస్ షో సీజన్ 4 ప్రయాణం దాదాపు సగం పూర్తి అయిపోయింది. 7వారాలు ముగించుకుని 8వ వారం లో అడుగు పెట్టడంతో.. హౌస్ లో మిగిలి ఉన్న సభ్యులు ఎవరికి వారు పక్కా గేమ్ స్ట్రాటజీ తో టైటిల్ గెలవడానికి తహతహలాడుతున్నారు. ఇదిలా ఉండగా సీజన్ ఫోర్ లో ఇంటి లోకి ఎంటరయిన సభ్యులలో బలమైన కంటెస్టెంట్ గా నోయల్ ప్రేక్షకుల దృష్టిలో గుర్తింపు పొందాడు.
అంతేకాకుండా హౌస్ లో రెండు సార్లు కెప్టెన్ అయ్యి మంచి టఫ్ ఫైట్ ఇచ్చాడు. కచ్చితంగా టాప్ ఫైవ్ లో నోయల్ ఉంటాడని… అతని ఆట తీరు బట్టి సోషల్ మీడియాలో నెటిజన్లు బయట జనాలు అనుకున్నారు. కానీ ఇంతలోనే నోయల్ అనారోగ్యానికి గురి కావడం అందరికీ షాక్ కి గురిచేసింది. ఆర్థరైటిస్ కారణంగా భరించలేని నొప్పి రావడంతో ఇంటి నుండి బయటకు వచ్చేసిన నోయల్… ప్రస్తుతం బయట వెబ్ మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలో మీద ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు.
ఇదిలా ఉండగా మళ్ళీ నోయల్ రీ-ఎంట్రీ అనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్న తరుణంలో.. నాగార్జున ఇటీవల నోయల్ రీ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చేసినట్లు మాట్లాడటం జరిగింది. మళ్లీ నోయల్ హౌస్ లోకి వస్తాడని ఇంటిలో ఉన్న సభ్యులు కూడా భావిస్తున్న తరుణంలో… నాగార్జున ఇక డైరెక్ట్ గా ఫినాలే రోజు నాడు రావడం తప్ప మళ్లీ హౌస్లో అడుగుపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పటంతో… ఇంటిలో ఉన్న సభ్యులు మాత్రమే కాక బయట నోయల్ అభిమానులు ఒక్కసారిగా కంగు తిన్నారు. నోయల్ చాలావరకు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు తెలపటంతో… మళ్లీ గేమ్ ఆడితే మరింత ప్రమాదం వాటిల్లే అవకాశం ఉండటంతో… నోయల్ ఇంకా పూర్తిగా బిగ్ బాస్ హౌస్ కి దూరమవడం జరిగిందట.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?