అర్థరైటిస్ పెయిన్ కారణంగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసిన కంటెస్టెంట్ నోయల్ తన బెస్ట్ ఫ్రెండ్ బిగ్ బాస్ త్రీ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ చేసిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. బిగ్ బాస్ షో తరఫున జరిగిన ఇంటర్వ్యూలో రాహుల్ సిప్లిగంజ్ నోయల్ కి అనేక ప్రశ్నలు వేయడం జరిగింది.
దీనిలో భాగంగా హౌస్ లో ఫెయిర్ జంట ఎవరు అని ప్రశ్నించగా… ఆప్షన్స్ ఇస్తూ అఖిల్..మోనాల్, అవినాష్… అరియణా, సోహెల్ మెహబూబ్ అని అనగా టక్కున ఏమి ఆలోచించకుండా సోహెల్, మెహబూబ్ అని నోయెల్ సమాధానమిచ్చాడు. ఇద్దరూ చాలా జెన్యూన్ గేమ్ ఆడుతున్నారని పేర్కొన్నారు. సోహెల్ ది చిన్నపిల్లల మనస్తత్వం అని…ఇద్దరు మాట్లాడుకుంటున్నా సమయంలో మధ్యలో ఎందుకు వస్తారో ఎందుకు అరిచి వెళ్ళిపోతారో అర్థం కాదు అంటూ నోయల్ తెలిపాడు.
ఇక మెహబూబ్ అయితే టాస్క్ లో 100% ఎనర్జీ పెట్టి ఆడుతాడు అని నోయల్ పేర్కొన్నాడు. ఇద్దరూ చాలా కలసికట్టుగా చాలా జెన్యూన్ గా మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు అని అన్నారు. ఇదే క్రమంలో మళ్లీ హౌస్లో వెళ్లే ఛాన్స్ వస్తే ఏం చేస్తారు అని రాహుల్ ప్రశ్నించగా, ఈ సారి గట్టిగా హౌస్ లో పోటీ ఇస్తానని నోయల్ పేర్కొన్నాడు. అందరికంటే హౌస్ లో హారిక ని బాగా మిస్ అవుతున్నట్లు నోయల్ పేర్కొన్నాడు. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషి హారిక విజయం సాధించాలని…హౌస్ లో తనని చూసినప్పుడు హారికా కి తన డాడీ గుర్తొచ్చే వారని చెప్పినట్లు నోయల్ తెలిపాడు.