బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో 8వ వారం నామినేషన్ కి ఆరుగురు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా ఆరుగురిలో చాలామంది స్ట్రాంగ్ కంటెస్టెంట్ లు ఉన్నా రు. ఇదిలా ఉండగా ప్రతి వారం నామినేట్ అయ్యే అభిజిత్ ఈసారి మాత్రం కాస్త సేఫ్ జోన్ లో ఉండటం విశేషం. ఇదే తరుణంలో సోహెల్ కూడా నామినేట్ కాలేదు. కాగా ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ లు పేర్లు గమనిస్తే అఖిల్, మోనాల్, అరియానా, మెహబూబ్, అమ్మ రాజశేఖర్, లాస్య ఉన్నారు.
అయితే వీరిలో బలమైన ఇంటి సభ్యులు అంచనా వేస్తే అరియానా, అఖిల్, లాస్య. మిగతా ముగ్గురు నీ గమనిస్తే అమ్మ రాజశేఖర్, మోనాల్, మెహబూబ్. ఈ ముగ్గురికి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ ఉన్నట్లు తేలింది. దీంతో రాబోయే వారం లో ఈ ముగ్గురిలో ఒకరు గ్యారెంటీ అవుట్ అనే డిస్కషన్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో గట్టిగా జరుగుతున్నాయి.
వాస్తవానికి లాస్ట్ ఎలిమినేషన్ లో మోనాల్ హౌస్ నుండి వెళ్ళిపోతుందని అందరూ భావించారు కానీ సీన్ రివర్స్ అయ్యింది. దివి ఇంటినుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయితే ఈ వారంలో మాత్రం ఈ ముగ్గురిలో ఒకరు గ్యారెంటీగా హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వటం పక్కా ని సోషల్ మీడియాలో నెటిజన్లు బయట జనాల టాక్.