11వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ హాట్ హాట్ గా సాగింది. ఈ వారం ఇంటి నుండి బయటికి వెళ్లడానికి ఎలిమినేషన్ జోన్ లో ఉన్నది..అభిజిత్, సోహెల్, లాస్య, మోనాల్, హారిక, అరియనా. వీరిలో లో ఎక్కువ ఓట్లు పడుతున్నా కంటెస్టెంట్ గా అదే విధంగా టైటిల్ విన్నర్ గా ఇప్పటికే అభిజిత్ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది.
గేమ్ చాలా తెలివిగా ఆడటంతో పాటు స్ట్రాటజీ లు వేస్తూ ఇంటిలో కీలకంగా రాణిస్తున్న అభిజిత్ కి సోషల్ మీడియాలో నెటిజన్ల తోపాటు ప్రముఖుల ఫాలోయింగ్ కూడా పెరుగుతోంది. ఆ తరువాత సోహైల్ అదేవిధంగా లాస్య కి ఎక్కువ ఓట్లు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే విషయంలో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వారిని వాళ్ళు మరెవరో కాదు మోనాల్, హారిక. ఇద్దరికీ ఓట్లు అనుకున్న స్థాయిలో రావడం లేదని ప్రచారం జరుగుతోంది.
పైగా గేమ్ చివరి దశకు చేరుకోవడంతో .. ఇద్దరి మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా నడుస్తుంది. కాగా హారిక తెలుగు అమ్మాయి కావటంతో ఇద్దరిలో కాస్త హారికకు కొంత హోప్స్ ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రతి వారం ఎలిమినేషన్ ప్రక్రియకు నామినేట్ అవుతున్న మోనాల్ విషయంలో ఎప్పటికప్పుడు ఆమె సేవ్ అవడం ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఈ వారం లో గ్యారెంటీగా ఎక్కువశాతం మోనాల్ ఎలిమినేట్ అవటం గ్యారెంటీ అని మీ గుజరాత్ అమ్మాయి బయటికి వెళ్లిపోవడం పక్క అంటూ బయట టాక్ నడుస్తోంది.