బిగ్ బాస్ 4: ఆ కంటెస్టెంట్ కి ఫుల్ సపోర్ట్ కి రెడీ అవ్వుతున్న పవన్ ఫ్యాన్స్..!!

ఏడవ వారం లో అడుగు పెట్టింది బిగ్ బాస్ సీజన్ ఫోర్. కాగా సోమవారం జరిగిన నామినేషన్ల ప్రక్రియలో మోనాల్, దివి, అవినాష్, అరియనా, అభిజిత్, మోనాల్ నామినేషన్ లో నిలిచారు. జరిగిన ఈ ప్రక్రియలో మెహబూబ్ నామినేషన్ అవటానికి ఏ మాత్రం ముందుకు రాకపోవటంతో మరోపక్క ఆరియనా తనకు తానుగా నామినేట్ కావడంతో సోషల్ మీడియాలో ఆమె పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నామినేషన్ సమయంలో మెహబూబ్ తో ఆమె మాట్లాడిన విధానం పాయింట్ టు పాయింట్ ఇరుకున పెట్టే రీతిలో వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

Ariyana Glory in Bigg Boss 4 Telugu - tollywoodదీంతో బయట జనాలు సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెను లేడి పవర్ స్టార్ గా అభివర్ణిస్తున్నారు. తండ్రి లేని పిల్ల పైగా తల్లి సంరక్షణలో పెరిగి చాలా కష్టాలు పడి హౌస్ లో ఆమె ఆడుతున్న ఆట తీరు ఇంటిలో ఉన్న సభ్యులకే కాక బయట చాలా మంది ని ఆకట్టుకుంటుంది. ఇటువంటి తరుణంలో ఇలాంటి వారికి సపోర్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ అభిమానులు డిసైడ్ అయ్యారట.

 

సోషల్ మీడియా వేదికగా లేడి పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అరియనకి అండగా ఉండటానికి పవన్ ఫ్యాన్స్ డిసైడ్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మామూలుగా పవన్ అభిమానులు తలచుకుంటే రికార్డులు ఏ స్థాయిలో సోషల్ మీడియాలో నెలకొంటాయి అన్న విషయం గురించి ఆరా తీస్తే గిన్నిస్ బుక్ దాకా వెళ్లాల్సి ఉంటుంది. ఇటువంటి తరుణంలో ఇటువంటి అభిమానులు అరియనాకి అండగా ఉండటానికి బరిలోకి దిగడం అనే వార్త ఇప్పుడు పెను సంచలనంగా మారింది.