తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ ఫోర్. ప్రస్తుతం రన్ అవుతున్న ఈ సీజన్ క్లైమాక్స్ కి చేరుకుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ల తో కలిపి దాదాపు 19 మంది హౌస్ లో అడుగు పెట్టగా, ఏడుగురు మాత్రం మిగిలి ఉన్నారు. దీంతో ఇంకో మూడు వారాల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో హౌస్ లో ఉన్న సభ్యులు గెలవడం కోసం రకరకాల స్ట్రాటజీ వేసుకుంటూ..గేమ్ ఆడుతున్నారు.
ఇదిలా ఉండగా సీజన్ స్టార్ట్ అయిన ప్రారంభంలో మోనాల్ ఆటతీరుపై సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ వచ్చిందన్న సంగతి తెలిసిందే. ప్రతిసారి హౌస్ ప్లాన్ నడుస్తుంది అని, ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపించుకుంటూ గేమ్ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపటం లేదని జనాలే సోషల్ మీడియాలో ఆమె పై అనేక విమర్శలు చేయడం జరిగింది. అసలు మోనాల్ ప్రారంభంలోనే ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వాల్సిన క్యాండిడేట్ అని కావాలని బిగ్ బాస్ షో నిర్వాహకులు ఆమెను కాపాడుతున్నారని మొన్నటి దాకా వార్తలు వచ్చాయి.
కానీ ఇటీవల మోనాల్ ఆడుతున్న ఆట తీరు బయట ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటునట్లు అర్థమవుతుంది. అందువల్లే సీజన్ క్లైమాక్స్ చేరుకునేసరికి మోనాల్ ఓటింగ్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది అనే టాక్ సోషల్ మీడియాలో వినబడుతుంది. కాగా హౌస్ లో ఉన్న వాతావరణం బట్టి మోనాల్ ఫైనల్ కి ప్రస్తుత పరిస్థితుల్లో కచ్చితంగా చేరుతుందని.. మోనాల్ గనుక ఇంటి నుండి ఎలిమినేట్ అయితే షో కి టిఆర్పి రేటింగ్ పడిపోతుందని బయట ఆడియన్స్ సోషల్ మీడియా లో గట్టిగా డిస్కషన్లు చేసుకుంటున్నారు.