బిగ్ బాస్ 4: ఇంట్లో ఉన్న అభిజిత్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రాహుల్..!!

బిగ్ బాస్ సీజన్ త్రీ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్… సీజన్ ఫోర్ లో స్టార్ మా తరపున ఇంటి నుండి ఎలిమినేట్ అయిన వారిని ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో కలిగే అనుభవాలు గురించి అదేవిధంగా ఇంటిలో ఇతర సభ్యుల పై వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకుంటూ రకరకాల ప్రశ్నలతో రాహుల్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Find Out The Winning Formula Of Shiva Balaji, Kaushal, Rahul: Is Abhijeet Copying Them?సీజన్ త్రీ లో జెన్యూన్ గేమ్ ఆడిన రాహుల్… టైటిల్ విన్నర్ గా గెలుచుకుని మంచి పాపులారిటీ తెలుగు రాష్ట్రాలలో సంపాదించాడు. ఇటువంటి తరుణంలో రాహుల్ సిప్లిగంజ్ చాలా ఇంటర్వ్యూలలో మొన్నటి వరకు ప్రస్తుతం జరుగుతున్న సీజన్ విన్నర్ విషయంలో తన అంచనా ప్రకారం ఇంటిలో ఉన్న అభిజిత్ మైండ్ గేమ్ ప్లే చేస్తూ కూల్ ఆట ఆడుతున్నాడు అని..కచ్చితంగా ఈ సీజన్ టైటిల్ విన్నర్ అతను అయ్యే అవకాశం ఉందని మొన్నటివరకు తెలిపాడు.

 

కానీ అనూహ్యంగా రాహుల్ యూటర్న్ తీసుకుని… తన దృష్టిలో టైటిల్ విన్నర్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ జెన్యూన్ గేమ్ ఆడే వాళ్ళు అని కాబట్టి అంచనా ప్రకారం సొహైల్, అరీయనా అని చెప్పటంతో ఒక్కసారిగా అభి సపోర్టర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్లు అయింది.