బిగ్ బాస్ 4: అంతా బాగానే ఉన్నా అరియానా విషయంలో ఫీల్ అవుతున్న సమంత ఫ్యాన్స్..!!

అక్కినేని వారి కోడలు సమంత దసరా పండుగ నాడు బిగ్ బాస్ హౌస్ లో చేసిన హడావిడి ఓ రేంజ్ లో ఉంది. మొట్టమొదటిసారి యాంకరింగ్ టెలివిజన్ రంగంలో చిన్న శాంపిల్ గా సమంత చేసిన ప్రయోగం చాలావరకు విజయాన్ని సాధించింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. హీరోయిన్ గా మాత్రమే కాకుండా యాంకరింగ్ గా కూడా సమంతాకి మంచి భవిష్యత్ ఉందని సోషల్ మీడియాలో అదేవిధంగా బయట జనాల టాక్. ఇదిలా ఉండగా హౌస్ లో అందరితో కలివిడిగా కలిసిపోయిన సమంత వేసిన పంచులకు మాట్లాడిన విధానానికి ఫిదా అయిన ఫ్యాన్స్.. ఒక్క విషయంలో మాత్రం బాగా హర్ట్ అయ్యారట.

Ariyana Glory in Bigg Boss 4 Telugu - tollywoodక్లియర్ కట్ మేటర్ లోకి వెళ్తే ఇంటి సభ్యురాలైన లేడీ కంటెస్టెంట్ అరియనా ఈ విషయంలో సమంత అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు అట. అరియనా మొదటి నుండి ఇంటిలో అల్లరి పిల్లగా పేరు తెచ్చుకోవడంతో ఆమెతో సమంత పోల్చుకోవడం జీర్ణించుకోలేక పోతున్నట్లు సోషల్ మీడియాలో టాక్. కానీ మరోపక్క అరియనా మాత్రం తనతో సమంత పోల్చడాన్ని చాలా ఎంజాయ్ చేసింది.

 

ఏది ఏమైనా బిగ్ బాస్ హౌస్ లో సమంత హోస్ట్ గా చేసిన విధానం చాలా మందిని ఆకట్టుకుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వచ్చేవారం వీకెండ్ లో కూడా సమంత అలరించనున్నట్లు టాక్. దాదాపు నాగార్జున 21 రోజులపాటు హిమాలయ పర్వతాల్లో తన కొత్త సినిమా “వైల్డ్ డాగ్” షూటింగ్ జరుపుకోబోతున్న నేపథ్యంలో సమంత రాబోయే రోజుల్లో కూడా బిగ్ బాస్ హౌస్ లో అలరించబోతున్నాట్లు సమాచారం.