టాలీవుడ్ ఇండస్ట్రీ కుర్ర హీరోలలో సందీప్ కిషన్ ఒకరు. ఇండస్ట్రీలో అనేక సినిమాలు చేస్తూ రాణిస్తున్న సందీప్ కిషన్ వెంకటాద్రి సినిమాతో బాగా పాపులర్ అవ్వడం జరిగింది. ఇండస్ట్రీలో ఎప్పుడూ కొత్తదనం గా ఆలోచిస్తూ మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ ప్రయోగాలు చేసే సందీప్ కిషన్ తాజాగా బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఫైనల్ లిస్టులో ఉన్న కంటెస్టెంట్ కి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు.
పూర్తి విషయంలోకి వెళితే హౌస్ లో ఉన్న సోహెల్ ని సపోర్ట్ చేస్తూ సందీప్ వీడియో చేయడం జరిగింది. కొద్ది రోజుల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో చాలా మంది ప్రముఖులు బిగ్ బాస్ హౌస్ లో తమకు నచ్చిన కంటెస్టెంట్ లకు మద్దతు తెలపాలని వారి అభిమానులను కోరుతూ వస్తున్నారు. దీనిలో భాగంగా సోహెల్ ని సపోర్ట్ చేసి సందీప్ కిషన్ వీడియోలు మాట్లాడుతూ.. కెమెరా ముందు కూడా నువ్వు నువ్వు లాగానే ఉన్నావు, మీలో ఎలాంటి మార్పు రాలేదు అని అన్నారు.
అంతమాత్రమే కాకుండా నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉందని కూడా తెలిపారు. ఫైనల్ రిజల్ట్ ఎలా ఉన్నా గాని బిగ్ బాస్ హౌస్ లో నువ్వు ఆడిన గేమ్ చాలా గర్వంగా ఉందని సందీప్ కిషన్.. సోహెల్ ఆటతీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇదే క్రమంలో చాలామంది ఫైనల్ విక్ వచ్చేసరికి సోహెల్ ని సపోర్ట్ చేస్తూ ఇతర దేశాలలో ఉన్న వాళ్లు కూడా వీడియో లు పెడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి విన్ అయ్యారు అంటూ ఓటింగ్ గురించి వస్తున్నా వార్తలు ఫేక్ అని అందరూ సోహెల్ ని సపోర్ట్ చేయాలని మరికొంతమంది విజ్ఞప్తి చేస్తున్నారు.