బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మగవాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా పోటీ ఇస్తున్న కంటెస్టెంట్ అరియానా. హౌస్ లో ఎలాంటి టాస్క్ అయినా…అరియానా తన పూర్తి పెర్ఫార్మెన్స్ తో రాణిస్తుంది. అదేవిధంగా ఇంటి సభ్యులతో ఏదైనా విషయం గురించి వాగ్వాదం చోటు చేసుకున్న పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ ముక్కుసూటి గేమ్ ఆడుతూ… హౌస్ లో బలమైన కంటెస్టెంట్ లు అనబడే వారితోకూడ శభాష్ అనిపించుకున్నెలా రాణిస్తోంది. అటువంటిది ఇటీవల బిగ్‌బాస్ “ఆడవాళ్ళకు మాత్రమే” కెప్టెన్సీ టాస్క్ ఇవ్వటంతో ఈ గేమ్ లో అరియానా గెలవడంతో ఇంటికి రెండవ మహిళ కెప్టెన్ గా అవతరించింది.
ఇదిలా ఉండగా ఆడవాళ్ళకు మాత్రమే అనే గేమ్ లో అరియానా కి కొద్దిగా సపోర్ట్ చేయటం తో.. ఆ తరువాత రేషన్ మేనేజర్ ఏర్పాటు విషయంలో మోనాల్ నీ అరియానా ఎంపిక చేయడంతో… మాస్టర్ కొత్త కెప్టెన్ పై సీరియస్ అవుతా అసహనం వ్యక్తం చేశాడు. నామినేషన్ లో ఉన్నప్పుడు రేషన్ మేనేజర్ గా ఇస్తే తనకు సపోర్ట్ అయ్యేదని అర్థం పర్థం లేని మాటలు అన్నాడు.
అంతే కాకుండా అసలు తాను మోనాల్ కి సపోర్ట్ చేసి ఉండాల్సిందని… నీకు అసలు విశ్వాసం లేదని అరియానా పై శాపనార్థాలు పెట్టే రీతిలో తెగ రెచ్చిపోయారు మాస్టర్. దీంతో అతని ప్రవర్తనతో విసుగెత్తిన అరియానా.. రేషన్ మేనేజర్‌గా ఉంటే సేవ్ అవుతారని ఎక్కడా లేదని స్పష్టం చేసింది. అయినా సరే పట్టించుకోని మాస్టర్.. నువ్వు చేసిన పనికి నాకు చెప్పుతో కొట్టినట్లుగా ఉందంటూ పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు. మాస్టర్ డైలాగులతో అరియానా తల పట్టేసుకుంది.