బిగ్ బాస్ ఇంటిలో ఉన్న సభ్యులకు తమ జీవితంలో ఇప్పటివరకు బయటి ప్రపంచానికి తెలియని సీక్రెట్ తెలియజెప్పాలని ఇచ్చిన టాస్క్ లో ఇంటి సభ్యులు రకరకాల స్టోరీలు చెప్పారు. దీంతో ఎవరు స్టోరీ నచ్చితే వారికి ఇంటి నుండి వచ్చిన లెటర్ అందుతుందని చెప్పటంతో సీక్రెట్ రూమ్ లో ఉన్న అఖిల్… హౌస్ లో ఎవరి స్టోరీ అయితే వింటున్నాడో .. తనకి నిజమా అనిపిస్తే వల్ల కి సంబంధించిన లెటర్ పంపుతున్నాడు.
ఈ క్రమంలో సోహెల్ చెప్పిన స్టొరీ కి బయట మంచి రెస్పాన్స్ వస్తోంది. పూర్తి విషయంలోకి వెళితే సోహెల్ తన సీక్రెట్ గురించి మాట్లాడుతూ…”ఇప్పుడు మందు మానేశాను. కానీ కొన్నేళ్ల క్రితం ఓసారి పబ్బు నుంచి తాగొస్తున్నా అప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే 102 రీడింగ్ వచ్చింది. కారు తీసుకుపోయారు. తర్వాతి రోజు స్టేషన్‌కు వెళ్లి చలానా కట్టిన. అప్పుడు కోర్టు స్లాట్ తీసుకోమన్నారు. తల్లిదండ్రులను తీసుకురమ్మన్నారు. డూప్లికేట్ పేరెంట్స్‌ను మాట్లాడిన.
కానీ మా ఫ్రెండ్ అట్లా నడవదని చెప్పిండు. కోర్టుకు వెళ్లాక ప్రతి ఒక్కడూ పదో తరగతి రిజల్ట్ వచ్చినట్టు నీ రీడింగ్ ఎంత అని అడుగుతూనే ఉన్నారు. ఆఖరికి మా తమ్ముడిని పిలిపించిన. ఇది అమ్మావాళ్లకు తెలియదు” అని సీక్రెట్ బయటపెట్టాడు.