11వ వారం లోకి బిగ్ బాస్ 4 వెళ్ళటంతో షో పై ఇంట్రెస్ట్ ఉన్న కొద్దీ ఆడియన్స్ లో పెరుగుతోంది. చాలా వరకు సగం గేమ్ అవ్వటం తో పాటు బిగ్ బాస్ రకరకాల టాస్క్ లు ఇస్తున్న తరుణంలో ఇంటి సభ్యుల ఆట బట్టి వారు ఇతరులతో వ్యవహరిస్తున్న తీరు బట్టి షో చూడటానికి మంచి ఇంట్రెస్ట్ ఆడియన్స్ లో నెలకొంటుంది.
అమ్మ రాజశేఖర్ ఉన్నంతకాలం అరియనా, అవినాష్ గ్రూపు గా ఉన్న ఇప్పుడు మాత్రం వాళ్ళిద్దరు యాక్షన్ లోకి రావడంతోపాటు అభిజిత్ కి దగ్గరవుతున్న క్రమంలో సరికొత్త వాతావరణం హౌస్ లో క్రియేట్ అవుతుంది. ఇదిలా ఉండగా ఇంటి నుండి మెహబూబ్ ఎలిమినేట్ కావడం తో హౌస్ మొత్తం ఎమోషనల్ అయిపోయింది. ముఖ్యంగా తోటి స్నేహితుడు ఎలిమినేట్ అవ్వటం సోహెల్ తట్టుకోలేకపోయాడు.
హౌస్ లో ఫస్ట్ నుండి ఇద్దరు చాలా జిగ్రీ దోస్త్ లుగా ఉండటమే కాక టాస్క్ వచ్చే సేపటికీ ఇద్దరూ నువ్వానేనా అన్నట్టుగా ఆడుతూనే ఒకడు ఓడిపోతే మరొకరు ప్రోత్సహించు కోవడం జరిగింది. ఇదిలా ఉండగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అదేవిధంగా కోపాన్ని బాగా తగ్గించుకొని హౌస్ లో ఫెయిర్ గేమ్ ఆడుతున్న వాడిగా బయట సోహెల్ కి మంచి పేరు ఉండటంతో ఇటీవల ఆయన వ్యవహరిస్తున్న తీరు పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. సోహెల్ దాదాపు టాప్ ఫైవ్ లో వెళ్లే కంటెస్టెంట్ అనేది చూసుకో అక్కర్లేదు. కానీ హౌస్ లో రిలేషన్ విషయంలో ప్రతి దానికి ఎమోషనల్ అవ్వడం వల్ల అతని గేమ్ మొత్తం పాడైపోతుందని బయట జనాలు అంటున్నారు. లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో కూడా అఖిల్, మెహబూబ్ లు ఫ్రెండ్స్ కాబట్టి సోహెల్ గేం నుండి తప్పుకున్నాడు. అయితే సోహెల్ చేసిన త్యాగానికి విలువ లేకుండా చేశారు అఖిల్, మెహబూబ్. అయితే సోహెల్ ఇలానే ఆట కొనసాగిస్తే మాత్రం అతను కూడా రిస్క్ లో పడే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.