బిగ్ బాస్ 4: మోనాళ్ ని కాపాడటం కోసం సోనుసూద్..?

కరోనా వైరస్ లాంటి కష్టకాలంలో లాక్ డౌన్ సమయంలో దేశంలో పేద వాళ్లను, వలస కూలీల ను ఆదుకున్న నటుడు సోను సూద్. వారి కోసం ప్రత్యేక రైళ్లు, బస్సులు అదేవిధంగా విమానాలను ఏర్పాటు చేసి దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అంతా తానే అన్నట్టు వ్యవహరించడం జరిగింది. దీంతో చాలామంది సినిమా రంగంలో సూపర్ స్టార్ లు ఉన్న అసలైన ఇండియన్ ఫిలిం సూపర్ స్టార్ సోను సూద్ అంటూ చాలా మంది సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిపించారు.

Bigg Boss 4 Telugu: Monal Gajjar Fans Request To Sonu Sood - Sakshiఒక్క లాక్డౌన్ సమయంలో మాత్రమే కాకుండా తరువాత కూడా చాలామందికి దేశంలో ఉన్న పేదవాళ్లకు తన సహాయాన్ని అందేలా సోను సూద్ ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదిలా ఉండగా సీజన్ ఫోర్ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ కి సోను సూద్ మద్దతు తెలపలని ఆమె అభిమానులు కోరాటం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

 

హౌస్ లో మోనాల్…. అభిజిత్ అఖిల్ తో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపినట్లు వ్యవహరించడంతో ఆమెపై బయట జనాలకు విపరీతమైన నెగటివ్ ఇంప్రెషన్ ఉంది. ఇటువంటి తరుణంలో మోనాల్ కి సోను సూద్ మద్దతు తెలపాలని… ఆమె అభిమానులు వేడుకొనడంతో, ఏ విధంగా సోనూసూద్ ఈ విషయంలో రియాక్ట్ అవుతారు అన్నది సస్పెన్స్ గా మారింది.