బిగ్ బాస్ 4: నా ఫుల్ సపోర్ట్ అతనికి అంటున్న శ్రీముఖి…!!

టెలివిజన్ రంగంలో యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించింది శ్రీముఖి. ఈటీవీ అదేవిధంగా జీ తెలుగులో పలు కామెడీ షో లకు యాంకర్గా చేస్తున్న శ్రీముఖి ఇటీవల యూట్యూబ్ చానల్ కూడా తనకంటూ సపరేట్ ఉండేటట్టు.. ఓపెన్ చేయడం జరిగింది. ఈ క్రమంలో పలు సెలబ్రిటీలను తీసుకొస్తూ ఇంటర్వ్యూలు చేస్తున్న శ్రీముఖి తాజాగా రన్ అవుతున్న సీజన్ ఫోర్ బిగ్ బాస్ షో పై సంచలన కామెంట్స్ సోషల్ మీడియాలో చేసింది.

Bigg Boss after Avinash for TRP's |మేటర్ లోకి వెళితే ప్రస్తుతం జరుగుతున్న సీజన్ చివరి దశకు చేరుకోవటంతో బయట చాలా మంది ప్రముఖులు… హౌస్ లో తమకు ఇష్టమైన కంటెస్టెంట్ లను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎలాగైనా తమ ఫేవరెట్ కంటెస్టెంట్ కి టైటిల్ దక్కేలా చూస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో గత సీజన్ రన్నరప్ గా నిలిచిన శ్రీముఖి … ప్రస్తుతం జరుగుతున్న సీజన్ ఫోర్ లో తనకిష్టమైన కంటెస్టెంట్ జబర్దస్త్ అవినాష్ అని తెలిపింది.

హౌస్ లో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ప్రతి ఒక్కరిని నవ్విస్తూ 100% షో కి న్యాయం చేస్తున్నాడు అని తెలుపుతూ శ్రీముఖి ఈసారి తన మద్దతు అవినాష్ కి కంటూ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసి అందరూ అతన్ని సపోర్ట్ చేయాలని యాంకర్ శ్రీముఖి కోరడం జరిగింది. ఒక్క శ్రీముఖి మాత్రమే కాక మెగా బ్రదర్ నాగబాబు కూడా అవినాష్ కి సపోర్ట్ చేస్తున్నారు. మరోపక్క కమెడియన్ తాగుబోతు రమేష్ కూడా అవినాష్ ని సపోర్ట్ చేయడం తో సోషల్ మీడియాలో చాలా మంది ప్రముఖులు సపోర్ట్ అవినాష్ కి ఉంది.