బిగ్ బాస్ 4: బోల్డ్ గా స్వాతి దీక్షిత్.. ఒక్కోక్కరికి బల్బులు పగులుతున్నాయిగా ..!

అజయ్ భూపతి తీసిన సెన్షేషనల్ హిట్ సినిమా ఆర్ ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా విపరీతమైన పాపులారిటి సాధించాల్సింది స్వాతి దీక్షిత్. కాని ఆ సినిమా కొన్ని రోజులు షూటింగ్ జరిగాక ఆ క్యారెక్టర్ కి స్వాతి సెట్ కాదన్న కారణంగా తప్పుకుంది. అదే క్యారెక్టర్ లో నటించి విపరీతమైన పాపులారిటీ సాధించింది పాయల్ రాజ్ పుత్. అయితే అప్పుడు రావాల్సిన క్రేజ్ అండ్ పాపులారిటీ బిగ్ బాస్ తో తెచ్చుకోవాలనుకుంటుంది స్వాతి దీక్షిత్. అందులో భాగంగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో హౌజ్ లోకి అడుగు పెట్టింది.

Bigg Boss 4 Telugu 3rd Wild Card Actress Swathi Dixit Entry - YouTube

బిగ్ బాస్ లో సక్సస్ ఫుల్ గా మూడవ వారం పూర్తి కాబోతుంది. ఈ తరుణంలో మూడవ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో తాజాగా అడపా దడపా చిన్న సినిమాలు చేస్తున్న హీరోయిన్ స్వాతి దీక్షిత్ వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే కుమార్ సాయి మరియు ముక్కు అవినాష్ లో వైల్డ్ ఎంట్రీ ఇవ్వగా హీరోయిన్ స్వాతి దీక్షిత్ వైల్డ్ కార్డ్ 3 వది.

ఇంటి సభ్యులు అంతా ఎవరి బిజీలో వారు ఉండగా బుట్టబొమ్మ పాట మొదలైంది. అంతా ఆశ్చర్యంగా చూస్తున్న సమయంలో మాస్క్ పెట్టుకుని స్వాతి దీక్షిత్ లోనికి ఎంట్రీ ఇచ్చింది. మొదట ఆమెను ఎవరు కనిపెట్టలేకపోయారు. మాస్క్ తీసిన తర్వాత కూడా ఆమె ఎవరో ఎక్కువ మంది గుర్తించలేదు. తనను తాను పరిచయం చేసుకున్న తర్వాత స్వాతి ముచ్చట్లలో ఉండగా బిగ్ బాస్ ఆమెకు స్వాగతం చెప్పి మగవారికి ఆమెను ఇంప్రెస్ చేయమంటూ టాస్క్ ఇచ్చారు.

Bigg Boss 4 Telugu: Swathi Deekshith enters the house today

స్వాతి తనను రాజశేఖర్.. అఖిల్.. నోయల్ మరియు అవినాష్ లు ఇంప్రెస్ చేశారంటూ చెప్పడంతో వారికి ప్రత్యేకమైన బహుమానం లభించింది. ఆమెతో ఆ నలుగురు పార్టీ చేసుకునే అవకాశం కల్పించారు. కాగా ఇప్పటికే 3 వారాలు గడుస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 చప్పగా సాగుతుందన్న టాక్ వినిపిస్తోంది. అయినా ప్రేక్షకులు మాత్రం క్రమం తప్పకుండా బిగ్ బాస్ ని ఫాలో అవడం ఆసక్తికరం. అయితే కాస్త నెగిటి కామెంట్స్ వినిపిస్తుండటం.. అలాగే ఐపిఎల్ ప్రభావం పడటం తో బిగ్ బాస్ సీజన్ 4 ని మరితంగా ఆసక్తికరంగా మలిచేందుకు బ్యూటీ అండ్ హాట్ గాళ్ స్వాతి దీక్షిత్ ని రప్పించారని చెప్పుకుంటున్నారు.