బిగ్‌బాస్ అంటేనే మాస్ మసాల సినిమా లాంటి ఎంటర్టైనిగ్ షో అని అందరూ ఫిక్సయ్యారు. ప్రతీ సీజన్ లో లవ్ ట్రాక్ లకి కొదవుండదు.. కొత్త కాదు. ఇప్పటికే బాలీవుడ్ లో ప్రసారమయిన సీజన్స్ లో ఈ వ్యవహారాలన్ని చూసినవే. ఇప్పుడు తెలుగులోనూ చూడాల్సి వస్తుంది. అయితే ఇప్పటి వరకు అటు హిందీ లో గాని, తమిళం లోగాని.. ఇప్పటి వరకు తెలుగులో ప్రసారమైన మూడు సీజన్స్ లో గాని ట్రయాంగిల్ లవ్ స్టోరీలు మాత్రం చాలా తక్కువ చూశాము. కాని ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ నాలుగో సీజన్లో ఈ ట్రయాంగిల్ స్టోరీ కనిపిస్తోంది.
అభిజీత్ – మోనాల్ – అఖిల్ మధ్య ఏదో జరుగుతోంది అంటూ బిగ్‌బాస్ ప్రోమోల్లో చూపిస్తున్నారు. అభిజీత్ – మోనాల్ మాట్లాడుకుంటుంటే అఖిల్ సీరియస్‌గా చూస్తుండటం… మోనాల్‌లో ఎవరితోనైనా డ్యాన్స్ చేస్తుంటే అఖిల్ కి మండిపోవడం అందరికి తెలుస్తుంది. అయితే ఇదంతా అభిజీత్‌ను టార్గెట్ చేయడం కోసమే అని టాక్ వినిపిస్తుంది,
మోనాల్‌తో పరియం పెంచుకుందామని.. మంచి బాండింగ్ ఏర్పరచుకుందామని అభిజీత్ గట్టిగానే ట్రై చేస్తున్నాడు. అయితే మోనాల్ అంతగా మాట్లాడలేదు. ఏదైనా మాట్లాడినా ముభావంగా ఉంటుంది తప మనస్పూర్తిగా మాట్లాడిన సందర్భాలు తక్కువగా కనీస్తున్నాయి. ఇదంతా రాత్రి నిద్రపోయే ముందు జరిగింది. మళ్ళీ ఉదయం లేచి చూసేసరికి… అఖిల్ కోపం మీద ఉన్నాడు.
మొన్న మోనాల్ – అభిజీత్ దోసలు తింటున్నప్పుడు మోనాల్‌కు పొలమారింది. నీళ్ల కోసం అభిజీత్ లేచి గ్లాస్ అందుకొని నీళ్లు పట్టడానికి వచ్చేలోగా… దూరంగా టిఫిన్ చేస్తున్న అఖిల్ వచ్చి బాటిల్లో నీళ్లు పడుతున్నాడు. ‘ఏంటి ఇస్తున్నావా’ అని అభిజీత్ అడిగినా అఖిల్ సమాధానం చెప్పలేదు. అంతేకాకుండా విసరుగా వెళ్లిపోయాడు కూడా. ఆ తర్వాత కూడా ఇలాంటివే రిపీటయ్యాయి. ఇదే విషయాన్ని ఎవరు అడిగినా అఖిల్ సరిగ్గా సమాధానం చెపలేదు. మార్నింగ్ వేకప్ సాంగ్‌లో డ్యాన్స్‌లు వేసేటప్పుడు కూడా అఖిల్ సింగిల్‌గా డ్యాన్స్ చేస్తూ కనిపించడం ధాకిచ్చింది.
అఖిల్ – అభిజిత్ – మోనాల్ విషయంలో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రేక్షకులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మొత్తానికి ఈ విషయంలో అభిజీత్ క్లారిటీ ఇచ్చాడు. ‘‘ఒక రోజు అఖిల్ వచ్చి… అభిజీత్‌తో నిన్న ‘రా’ అనొచ్చా అని అడిగాడు. 24 ఏళ్ల అఖిల్‌ది నా తమ్ముడి వయసు. ‘కాదురా ఇలా మాట్లాడు..’ అని అనడం వేరు.. ‘అరె అభిజీత్ ఇట్లారారేయ్’ అనడం వేరు. ఇదే విషయాన్ని అఖిల్ కు చెప్పా’’ అంటూ అభిజీత్ జరిగింది చెప్పుకొచ్చాడు. ఇద్దరం బెస్ట్ బడీస్ కానప్పుడు ఎందుకు ఫీలవ్వాలనుకున్నాడు.
ఇలానే మోనాల్ – అఖిల్ విషయంలో కూడా ఓ విషయం జరిగింది. ముందు రోజు రాత్రి అఖిల్ , అభిజీత్ మాట్లాడుకొని తర్వాత లేచి బాగానే వెళ్లి నిద్రపోయారు. తర్వాత రోజు ఉదయం లేచి అభిజీత్ నిద్ర ముఖంలో ఉండగా… మోనాల్ టీ ఇవ్వబోయింది. కాని సుగర్ టీ తాగే అలవాటు లేకపోవడంతో అభిజీత్ వద్దన్నాడు. ఇది మోనాల్ కి కోపం తెప్పించింది. ఆ టీని కాస్తా విసురుగా పక్కకి పడేసింది. అది అఖిల్ చూశాడు. ఈ రెండు విషయాల వల్ల అఖిల్ కోపంగా ఉన్నాడేమో అంటూ అభిజీత్ లాస్య, సుజాతకు చెప్పాడు. అయితే ఇక్కడ అసలు విషయమేంటంటే ఈ రెండూ బిగ్ బాస్ ప్రేక్షకులకు చూపించలేదు. వారం చివరిలో రివీల్ చేస్తారా అన్నది చూడాలి. మొత్తానికి అభిజీత్‌ను టార్గెట్ చేయాలని అఖిల్ ప్లాన్ చేస్తున్నాడా? లేక ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా అన్నది తెలిస్తే అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!