బిగ్ బాస్ 4 : ఓటింగ్ లో అభిజిత్ కి టాఫ్ ఫైట్ ఇస్తున్న ఆ కంటెస్టెంట్..!!

బిగ్ బాస్ హౌస్ లో చాలా కూల్ గా గేమ్ ఆడుతున్నది అభిజిత్. హౌస్ లో అభిజిత్ ఆడుతున్న గేమ్, వాగ్వాదం లోపాయింట్ టు పాయింట్ మాట్లాడే విధానం బయట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. టాస్క్ లో అదేవిధంగా ఎవరితో అయినా మాట్లాడే విషయం లో చాలా క్లారిటీ గా ఉంటూ పక్కా మైండ్ గేమ్ ప్లే చేస్తూనే మరోపక్క విజయాలు అందుకుంటున్నాడు. దీంతో సీజన్ ఫోర్ లో ఇంటిలో ఉన్న సభ్యులందరి కంటే ఎక్కువ ఓటింగ్ అభిజిత్ వస్తున్నట్లు మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.

Bigg Boss 4 Telugu: Jabardasth Avinash not happy with Abhijeetఇదిలా ఉండగా హౌస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన జబర్దస్త్ కంటెస్టెంట్ ముక్కు అవినాష్.. ఇప్పుడు అభిజిత్ కి ఓటింగ్ విషయంలో టఫ్ ఫైట్ ఇస్తున్నట్లు సరికొత్త టాక్ బయట వినపడుతోంది. హౌస్ లో హండ్రెడ్ పర్సెంట్ గేమ్ ఆడుతూనే మరోపక్క చూస్తున్న ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేస్తున్న కంటెస్టెంట్ గా అవినాష్ ని జనాలు పొగుడుతున్నారు.

 

అంతే కాకుండా టాప్ ఫైవ్ లో అవినాష్ వెళ్ళటం గ్యారెంటీ అని తెగ చెప్పుకుంటున్నారు. దీంతో ఏడో వారం కి వచ్చిన ఓటింగ్ లో అభిజిత్ కంటే అవినాష్ కి ఎక్కువ ఓట్లు వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇద్దరి ఆట పరంగా చూసుకుంటే అభిజిత్ కేవలం గేమ్ మాత్రమే ఆడుతున్నారని అవినాష్ ఒకపక్క గేమ్ ఆడుతూనే మరో పక్క నటుడిగా జనాలను నవ్విస్తున్నాడు అని బయట జనాలు అంటున్నారు.