బిగ్ బాస్ హౌస్ లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. దీపావళి పండుగ ఎపిసోడ్ లో ఈవారం ఎలిమినేషన్ ఉండదని అందరూ భావించిన లెక్కలు తలకిందులయ్యాయి. దీపావళి సందర్భంగా ఎలాంటి ఎలిమినేషన్ లేకుండా సీక్రెట్ రూమ్ లో ఉన్నా అఖిల్ ని సేవ్ చేసిన బిగ్ బాస్.. అతడికి మరో వారం ఇమ్యూనిటీ ఇవ్వటమే కాకుండా ఎలాంటి టాస్క్ లేకుండా కెప్టెన్ చేసేశాడు.
ఇదిలా ఉంటే తాజాగా లీక్ అవుతున్న వార్తల ప్రకారం ఈసారి హౌస్ నుండి మెహబూబ్ ఎలిమినేట్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎప్పటి నుండో మెహబూబ్ మీద వ్యతిరేకత ఉన్నా నామినేషన్ లో పెద్దగా దొరకలేదు. ఎట్టకేలకు దొరకటంతో వీక్షకులు మెహబూబ్ కి షాక్ ఇస్తు ఓట్లు వేసినట్లు సమాచారం. ప్రస్తుతం హౌస్ లో అరియానా మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ మెహబూబ్ మీద అంతకన్నా ఎక్కువే ఉండటంతో అతడికి పెద్దగా ఓట్లు పడ లేదట.
హౌస్ లో ఫిజికల్ టాస్క్ లు ఇరగదీసిన గాని, మనోడు మాటతీరు కొద్దిగా నాటు గా ఉండటంతో పాటు అభ్యంతరకరంగా ఉండడంతో ఎప్పటి నుండో బయటకు పంపించాలని ఎదురుచూస్తున్న ఆడియన్స్ కి నామినేషన్ లో ఈ వారం దొరికి పోవడంతో మెహబూబ్ ని సాగనంపుతూన్నట్లు వార్తలు వస్తున్నాయి. సోహెల్ తో ఫ్రెండ్షిప్, ఫిజికల్ టాస్క్ లో తప్పా స్క్రీన్ స్పేస్ విషయంలో ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోని విధంగా మెహబూబ్ వ్యవహరించడంతో… ఓట్లు తక్కువ పడినట్లు ఇంటి నుండి ఎలిమినేట్ అవుతున్నట్లు టాక్ వస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?