బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో మొదటి నుండి బలమైన కంటెస్టెంట్ గా పేరు సంపాదించాడు అభిజిత్. ఇప్పటివరకు అన్ని ఎలిమినేషన్ లలో వెళ్లిన అభిజిత్ తిరిగి సేవ్ అవుతూ హౌస్ లోకి రావడం జరిగింది. బయట ఆడియన్స్ సపోర్ట్ మాత్రమేగాక ప్రముఖులు కూడా ఈ సీజన్ విన్నర్ అభిజిత్ అని అంటున్నారు. సరైన స్ట్రాటజీ తో పక్కా గేమ్ ప్లానింగ్ తో స్టడీ అండ్ స్లో మోషన్ తో అభిజిత్ ఆడే గేమ్ చాలా మందిని ఆకట్టుకుంది.
పైగా ఇంటిలో ఉన్న సభ్యులందరికీ కంటే ఓటింగ్ విషయంలో రికార్డు స్థాయిలో కొల్లగొడుతున్నాడు. అయితే అంతా బాగానే ఉన్నా గానీ ఒక్క ఫిజికల్ టాస్క్ విషయంలో అభిజిత్ ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోవడంతో అతన్ని వ్యతిరేకించే ఇతర కంటెస్టెంట్ ఫాలోవర్స్ ఫిజికల్ టాస్క్ లు ఆడ లేడు, పైగా గేమ్ అయిపోయిన తర్వాత అక్కడ ఇక్కడ ముచ్చట్లు పెడతాడు మైండ్ గేమ్ తప్ప విషయం లేదు అంటూ ట్రోలింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇటువంటి విమర్శలకు తాజాగా కమాండో ఇన్స్టిట్యూట్ టాస్క్ లో అభిజిత్ ఆడిన ఆటకు విమర్శకులకు గట్టి సమాధానం చెప్పినట్లు సోషల్ మీడియాలో బయట జనాలు చర్చించుకుంటున్నారు. చాలా మంది సభ్యులు అభిజిత్ టాస్క్ కి వచ్చేటప్పటికి ఆడ లేడు అంటూ వచ్చిన విమర్శలకు కమాండో గేమ్ లో బాగా ఆడి అందరి నోళ్ళు మూయించాడు అంటూ బయట జనాలు అభిజిత్ ఫాలోవర్స్ చర్చించుకుంటున్నారు.