బిగ్ బాస్ 4: చివరిలో మొత్తం పరువు తీసుకుంటున్న కంటెస్టెంట్..??

బిగ్ బాస్ గేమ్ ఫైనల్ కి చేరుకోవడంతో ఎవరికి వారు గెలవాలని తెగ ఉత్సాహం ఉబలాటపడుతున్నారు. అయితే ఈ సీజన్ లో ఎక్కువగా చూస్తున్న ప్రేక్షకులను జంటగా అలరించిన కంటెస్టెంట్ లలో ఎక్కువగా పేరు వినబడేది అఖిల్ అండ్ మోనాల్. మొదటి నుండి వీరిద్దరూ హౌస్ లో చాలా క్లోజ్ గా ఉంటూ రాణించడం జరిగింది.

మోనాల్ పక్కనే అఖిల్ వీడియో ఫుటేజ్ లు వుండేలా ఈ సీజన్ జర్నీ సాగింది. హౌస్ లో వీరిద్దరిని చూసిన చాలా వరకు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోగా బయట మాత్రం ఖచ్చితంగా లవర్స్ అనే ముద్ర పడిపోయింది. మొదటిలో అభిజిత్ కూడా ఉన్న గాని.. మధ్యలో ఎలిమినేషన్ సమయంలో చిన్న ట్రాష్ రావడంతో అభిజిత్ కి మోనాల్ తో మాటలు లేని పరిస్థితి ఏర్పడింది.

 

అయితే ఇటీవల మళ్లీ వీరిద్దరూ క్లోజ్ అవ్వడం జరిగింది. ఇదిలా ఉండగా మొదటినుండి అన్ని విషయాలలో టాప్ కంటెస్టెంట్ గా అఖిల్.. ఫిజికల్ టాస్క్ ఇంకా అనేక గేమ్స్ లో బిగ్ బాస్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాడు. మరి చివరిలో ఏమైందో ఏమో తెలియదు గానీ అఖిల్ ఇటీవల ఆడుతున్న తీరు చాలా విచిత్రంగా ఉన్నట్లు బయట టాక్. ముఖ్యంగా మోనాల్ విషయంలో.. సోమవారం జరిగిన నామినేషన్ ఎపిసోడ్ లో , అదేవిధంగా కెప్టెన్సీ టాస్క్ సమయములో అఖిల్ మాట్లాడిన విధానం పై బయట అతనిపై నెగిటివ్ కామెంట్లు భారీ స్థాయిలో వస్తున్నాయి. మరోపక్క మోనాల్ కూడా అఖిల్ ఎందుకు ఈ విధంగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ షాక్ అవుతోంది. ఇదే విషయాన్ని మంగళవారం జరగబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో కెప్టెన్ హారికా కి చెబుతోంది. మోనాల్.. కెప్టెన్ కి అఖిల్ గురించి ఏమని చెప్పింది అంటే.. అఖిల్ సూప‌ర్‌ జెన్యూన్ అని, కానీ ఈ మ‌ధ్య అత‌డికి ఏమైందో అర్థం కావ‌ట్లేద‌ని కంట‌త‌డి పెట్టుకుంది. మరోపక్క ఇదే సమయంలో బాధలో ఉన్న మోనాల్ కి అభిజిత్ దగ్గరవుతూ నువ్వు మా నాన్నకి నచ్చటం చాలా గ్రేట్ అంటూ డైలాగ్ వేయటంతో మంగళవారం జరగబోయే ఎపిసోడ్ పై బిగ్ బాస్ ఆడియన్స్ కి ఎంతో ఇంట్రెస్ట్ నెలకొంది.