బిగ్ బాస్ హౌస్ లో ఇటీవల ఇంటి నుండి ఎలిమినేషన్ అయిన మాస్టర్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హౌస్ లో తను జర్నీ గురించి అనేక విశేషాలు పంచుకున్నారు. ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి తన అభిప్రాయాన్ని తెలుపుతూ వచ్చిన అమ్మ రాజశేఖర్… సోహైల్ విషయానికి వచ్చేసరికి బ్రదర్ అటాచ్మెంట్ మాటలు మాట్లాడారు.
సోహైల్ ని చూస్తే తన బ్రదర్ గుర్తోస్తరని అన్నారు. మనసులో ఏది ఉన్నా మొహం మీద చెప్పేస్తాడు అని మాస్క్ లేకుండా ఇంటిలో గేమ్ ఆడుతున్నది సోహైల్ అని అన్నారు. చిన్నపిల్లల మనస్తత్వం అని, కోప పడిన మళ్ళీ తర్వాత కలిసి పోతాడని, హౌస్ లో తనకు ఇష్టమైన వ్యక్తి సోహైల్ అని స్నేహం కోసం ఎంతకైనా వెళ్లే మనిషి అని… మాస్టర్ ఇంటర్వ్యూలో తెలిపారు.
మెహబూబా నీ చూస్తే తనని తాను చూసుకున్నట్లు ఉంటుందని, వాడిలో ఫైర్ బాగుంటుందని కానీ తెలివి లేదని, అదే హౌస్లో వాడికి చెప్పానని, తనకి శిష్యుడు లాంటి వాడు అని మాస్టర్ తెలిపారు. మోనాల్ తింగర తనం ఎక్కువ అని, ప్రతి విషయానికి ఏడుస్తుంది అంటూ అమ్మ రాజశేఖర్ చెప్పుకొచ్చారు. అభిజిత్ బద్దకస్తుడు వాడి వల్ల టిఆర్పి రేటింగ్ కూడా రాదు, టాస్క్ కూడా ముందుకు వెళ్ళకుండా అడ్డుకున్నాడు ఫుడ్ విషయంలో నానా రాద్ధాంతం చేస్తున్నాడు అంటూ తన అభిప్రాయాన్ని ఇంటర్వ్యూలో మాస్టర్ చెప్పుకొచ్చారు.