బిగ్ బాస్ సీజన్ 4 దిగ్విజయంగా తొమ్మిది వారాలు ముగించుకుని పదో వారంలో అడుగుపెట్టింది. దీంతో హౌస్ లో వాతావరణం చాలా టెన్షన్ గా నెలకొంది. ఏ క్షణాన ఏమవుతుందో, ఎవరు ఎవరికి శత్రువులు అవుతారు అనే రీతిలో చూస్తున్న ప్రేక్షకులలో కూడా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా హౌస్ లో ఇటీవల ఎలిమినేషన్ అయిన అమ్మ రాజశేఖర్ విషయం పై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా డిస్కషన్ లు చేసుకుంటున్నారు.
హౌస్ లో చాలా పెద్ద వయసు కలిగిన వ్యక్తి టాస్క్ లు ఇచ్చినప్పుడు ఎలా ఆడాలో, ఎలా వ్యవహరించాలో ఆయనకు తెలియదు ఆయన ఎలిమినేట్ చేయడం చాలా కరెక్ట్ అని చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ జడ్జిమెంట్ పై సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇది ముమ్మాటికీ ప్రేక్షకుల ఓటింగ్ పరంగా జరిగిన ఎలిమినేషన్ అని చాలా రోజుల తర్వాత అంటున్నారు.
ఇదిలా ఉండగా మాస్టర్ ఎలిమినేషన్ విషయంలో అన్నిటికన్నా పెద్ద హైలెట్ బిగ్ బాస్ అతనికి ఇంటి నుండి వెళ్లేటప్పుడు బిగ్ బాంబ్ ఇవ్వకపోవడమే అని అంటున్నారు. ఇచ్చివుంటే మాస్టర్ తనలో మిగిలి ఉన్న బ్యాలెన్స్ మొత్తం తీర్చేసుకునే వారని ఖచ్చితంగా బిగ్ బాంబ్ అభిజిత్ మీద పడేది అని ఆడియన్స్ అంటున్నారు. ఇప్పటికే బయటకు వచ్చి ఇస్తున్న ఇంటర్వ్యూలలో అభిజిత్ ని వేస్ట్ ఫెలో అన్న రీతిలో మాస్టర్ మాట్లాడటం జరిగింది. ఏదిఏమైనా ఇంటినుండి మాస్టర్ వెళ్లి పోవడం పట్ల సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.