తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను దాదాపు వంద రోజులకు పైగానే అలరించింది బిగ్ బాస్ రియాల్టీ షో. బయట సినిమా ధియేటర్ లన్ని క్లోజ్ అవటంతో సీజన్ ఫోర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎంటర్టైన్మెంట్ కోరుకునే ఆడియన్స్ కి ఈ సీజన్ ఫుల్ మీల్స్ పెట్టినట్లు అయ్యింది. ఒకపక్క ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న బిగ్ బాస్ షో కి మాత్రం టిఆర్పి రేటింగ్ ఎక్కడ తగ్గకుండా చాలా జాగ్రత్త పడ్డారు షో నిర్వాహకులు.
ఎప్పటికప్పుడు హౌస్ లో సరికొత్త వాతావరణం ఉండేలా షో పై ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ కలిగేలా భారీ స్థాయిలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లతోపాటు సరికొత్త టాస్క్ లు ఇవ్వడం జరిగింది. చాలావరకు పాత టాస్క్ లు పెట్టిన గాని కొత్తగా పెట్టిన టాస్క్ లు ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేశాయని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు.
ఇదిలా ఉండగా సీజన్ త్రీ లో అదేవిధంగా సీజన్ ఫోర్ లో టైటిల్ విన్నర్స్ కి ఒకే తరహా పరిస్థితి హౌస్ లో ఎదురవ్వడం ఇప్పుడు సంచలనం అయింది. మేటర్ లోకి వెళ్తే సీజన్ త్రీ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ 11 సార్లు ఎలిమినేషన్ కి నామినేట్ అవ్వగా, సీజన్ ఫోర్ విన్నర్ అభిజిత్ కూడా 11 సార్లు ఎలిమినేషన్ కి నామినేట్ అయితే టైటిల్ విన్నర్ సాధించటం విశేషం. ఇదే విషయాన్ని రాహుల్ సిప్లిగంజ్ తనతో ఇంటర్వ్యూలో అభిజిత్ కూర్చున్నప్పుడు చెప్పి అభి ని అభినందించాడు.