బిగ్ బాస్ 4: డేంజర్ జోన్ లోకి వెళ్లిపోయిన ఆ టాప్ కంటెస్టెంట్..??

హౌస్ లో చోటుచేసుకుంటున్న సంఘటనలు, ఇంటి సభ్యులు వేస్తున్న స్టేజీలు బయట సపోర్ట్ లకు ఊహించని రీతిలో షాక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా సీజన్ ఫోర్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న అఖిల్… తాజాగా వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఫిజికల్ టాస్క్ ఇంకా ఎంటర్టైన్మెంట్ పరంగా అంతా బాగానే ఉన్నా గాని చాలా క్లోజ్ గా ఉండే మోనాల్ తో ఎలిమినేషన్ సమయంలో వ్యవహరించిన తీరు బయట అతనిపై చాలా నెగిటివ్ వీటిని ప్రొజెక్ట్ చేస్తుంది.

Bigg Boss Telugu 4: Akhil-Ariyana Beat Abhijeetఇదిలా ఉండగా ఎలిమినేషన్ కి నామినేషన్ అయిన వారిలో ఈవారం ఖచ్చితంగా అఖిల్ ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నట్లు తాజా వార్తలు వైరల్ అవుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే ప్రస్తుతం ఇంటిలో ఉన్న వాతావరణం బట్టి మోనాల్ నీ హారిక మరియు అభిజిత్ అభిమానులు ఓట్లు వేసి కాపాడే అవకాశం ఉన్నట్లు బయట టాక్ గట్టిగా వస్తుంది.

 

మరోపక్క ఎలిమినేషన్ లో ఉన్న అవినాష్ బ ఫ్రీ కార్డు ద్వారా సేఫ్ అయ్యే చాన్స్ ఉండటంతో…. ఇంకా మిగిలి ఉన్న అఖిల్, అరీయనా, మోనాల్ లలో…అఖిల్ యే ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మొన్నటి వరకు పెద్దగా గేమ్ పరంగా ఫోకస్ కాని మోనాల్ పై పడలేదు. కానీ ఇటీవల మోనాల్ ఇంటిలో  సభ్యులు చేత వ్యవహరిస్తున్న తీరు చాలా మందిని ఆకర్షిస్తుంది. పైగా హారికా ని కెప్టెన్ చేసే విషయంలో ఆమె ఆడిన తీరు ఆమె గ్రాఫ్ ని ఒక్కసారిగా పెంచేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న పరిణామాలను బట్టి చూస్తే ఇంటిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న అఖిల్ గ్యారెంటీగా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు సోషల్ మీడియాలో అదేవిధంగా బయట గట్టిగా వస్తున్నాయి. మొత్తంమీద చూసుకుంటే 12 వ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఇంటి నుండి ఎవరు వెళ్తారు అన్నది మాత్రం సస్పెన్స్ గా ఉంది.