బిగ్ బాస్ సీజన్ ఫోర్ గేమ్ చాలావరకూ ఫైనల్ దశకు చేరుకుంది. కేవలం ఇంకా మూడు వారాలు ఆట మాత్రమే మిగిలి ఉంది. ఇదిలా ఉండగా ఈ వారం జరగబోయే నామినేషన్ ప్రక్రియ చాలా హాట్ హాట్ గా సాగే అవకాశాలు ఉన్నట్లు లీక్ వార్తల నుండి అందుతున్న సమాచారం. ఈ సీజన్ స్టార్ట్ అయిన నాటి నుండి లీక్ వార్తల ప్రకారం ఎవరు ఇంటి నుండి ఎలిమినేట్ అవుతున్నారు ఎలిమినేషన్ ఏ విధంగా జరుగుతుంది వంటి విషయాలు ముందుగానే సోషల్ మీడియాలో పని చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈసారి నామినేషన్ ప్రక్రియ లో హౌస్ లో టాప్ కంటెస్టెంట్ లుగా పేరు తెచ్చుకున్న అభిజిత్, అవినాష్ నామినేషన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో ఉంటూ అభిజిత్ రూల్స్ పాటించడంలేదని స్వయంగా నాగార్జున ఇటీవల క్లాస్ తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈసారి నామినేషన్ లో అభిజిత్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చాలాసార్లు అభిజిత్ నామినేషన్ ప్రక్రియ లో ఉండటం తెలిసిందే.
ఇలా ఉండగా అభి తో పాటు అవినాష్ కూడా మరోసారి ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు బయట టాక్ గట్టిగా వస్తోంది. మేటర్ లోకి వెళ్తే బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం ఎలిమినేట్ అవుతనకున్న అవినాష్ ఎవిక్షన్ కార్డ్ తో సేవ్ అవటంతో ఈసారి కచ్చితంగా అతన్ని మళ్ళీ ఇంటి సభ్యులు నామినేషన్ల ఉంచడం గ్యారెంటీ అనే టాక్ బయటకు వస్తుంది. మొత్తంమీద చూసుకుంటే మిగతా మూడు వారాల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో సోమవారం జరగబోయే నామినేషన్ ఎపిసోడ్ వేడి వేడిగా ఉండే అవకాశం ఉందని బయట ఆడియన్స్ చెప్పుకుంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?