బిగ్ బాస్ 4: అవినాష్ కోసం వాళ్లంతా వీడియోలు చేస్తున్నారు..??

12 వ వారం బిగ్ బాస్ ఆట చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇంటిలో ఏడుగురు సభ్యులు మాత్రమే మిగిలి ఉండటంతో సోమవారం జరిగిన ఎలిమినేషన్ ఎపిసోడ్ ఇంటి సభ్యుల మధ్య మంచి కాక రేపింది. ఎవరికి వారు తాము బెస్ట్ కంటెస్టెంట్ అంటూ వాదించుకుని ఇతరులను నామినేట్ చేయడం జరిగింది. అయితే ఇంటికి కొత్తగా కెప్టెన్ అయిన హారిక జరిగిన ఈ ప్రక్రియలో ఎలిమినేషన్ కి నామినేషన్ అయిన అభిజిత్ ని బిగ్ బాస్ తనకిచ్చిన అవకాశంతో సేవ్ చేసింది.

ఇదిలా ఉండగా బిగ్ బాస్ గేమ్ చివరి దశకు వచ్చిన నేపథ్యంలో అవినాష్ కి కొద్దిగా ఓట్లు తక్కువ పడుతున్నట్లు తేలడంతో జబర్దస్త్ టీం రంగంలోకి దిగిన దట. తమ ఫ్రెండ్ అవినాష్ కి ఎలాగైనా సపోర్ట్ చేయాలని ఓట్లు వేయాలంటూ జబర్దస్త్ కమెడియన్ లు గెట‌ప్ శ్రీను, ఆటో రాంప్ర‌సాద్ అభిమానుల‌కు వీడియో సందేశం ద్వారా పిలుపునిచ్చారు.

 

పైగా ఈ వారం అవినాష్ హౌస్ లో ఉంటే కచ్చితంగా టాప్ ఫైవ్ లో కి వెళ్లే అవకాశం ఉండటంతో.. ఎలాగైనా తమ తోటి నటుడు మరియు జబర్దస్త్ టీం సభ్యుడు అవినాష్ ని కాపాడాలని అభ్యర్థిస్తున్నారు. మరోపక్క ఈ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే వారిలో ఓటింగ్ పరంగా చూస్తే అవినాష్ యే ముందు ఉన్నాడని బయట బలమైన టాక్ వస్తోంది. అవినాష్ తర్వాత అరియానా, మోనాల్ కి హౌస్ లో అతి తక్కువ ఓట్లు పడుతున్నట్లు బయట వార్తలు వినబడుతున్నాయి.