బిగ్ బాస్ 4 : హౌస్ లో వాళ్ళిద్దరూ నిజమైన రాక్షసులు..!!

బిగ్ బాస్ హౌస్ లో ఇటీవల ఇంటి సభ్యులు ఆడిన “కొంటె రాక్షసుడు మంచి మనుషులు” టాస్క్ కి బయట మంచి రెస్పాన్స్ వస్తోంది. రాక్షసులు మనుషులకు కోపం తెప్పించే విధంగా చేసిన చేష్టలు… చూసి జనాలు బాగా ఎంటర్టైన్ అయ్యారట. ముఖ్యంగా అరీయనా, అవినాష్ పెర్ఫార్మెన్స్ కి బయట జనాలు శభాష్ అంటున్నారు. అరియణా ఎక్కడా తగ్గకుండా నిజమైన రాక్షసిగా మంచి మనుషుల టీమ్ నీ టార్చర్ చేయటం లో అదరగొట్టింది అని జనాలు చెప్పుకుంటున్నారు.

సోహైల్, అఖిల్ షోలను ఎక్కడపడితే అక్కడ విసిరేయటం మాత్రమే కాకుండా అఖిల్ తో సారీ కూడా చెప్పించుకోవడం…టాస్క్ కి హైలెట్ అని జనాలు అంటున్నారు. మరి కొంతమంది ఇంటి సభ్యులతో సపరి వారి సేవలు అందిపుచుకున్నే విధంగా అరియాణా వ్యవహరించడం చాలా బాగుందని బయట టాక్.

 

ఇక అవినాష్ తన డైలాగులతో కామెడీ టైమింగ్ తో చేసిన పెర్ఫార్మెన్స్ కి కూడా బిగ్ బాస్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఏది ఏమైనా అవినాష్, అరియనా ఆడిన ఆట తీరు నిజమైన రాక్షసులను తలపించిందని… వాళ్ళిద్దరినీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ గా కెప్టెన్ నోయల్ ప్రకటించటం వందకి 100% కరెక్ట్ అని బయట జనాలు సపోర్ట్ చేస్తున్నారు.